BC Reservation: గవర్నర్‌కు కాంగ్రెస్ బీసీ నేతల ధన్యవాదాలు
ABN , Publish Date - May 03 , 2025 | 04:43 AM
రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ఉభయ సభలు చేసిన బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కాంగ్రెస్ బీసీ వర్గం నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్‌గౌడ్ నేతృత్వంలో జిష్ణుదేవ్‌ను కలిసిన నేతలు
బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు కృతజ్ఞతలు తెలిపి సన్మానం
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ఉభయ సభలు చేసిన బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కాంగ్రెస్ బీసీ వర్గం నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయులయ్య, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు విజయశాంతి, బస్వరాజు సారయ్య, అమెర్ అలీఖాన్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి జిష్ణుదేవ్ వర్మను కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో కులగణన నిర్వహించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలుస్తుందన్నారు. కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందని.. కేంద్రం జనగణనతో పాటు కులగణనకు తీసుకున్న నిర్ణయం రాహుల్, కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని చెప్పారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపట్టే జనగణన, కులగణనకు తెలంగాణే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. గతంలో తమ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
పార్టీ కోసం సమన్వయంతో పనిచేయాలి..
సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ సమన్వయంతో పార్టీ కోసం కలసి పనిచేయాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు మహేశ్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. మంత్రులు, జిల్లాకు చెందిన సీనియర్ నేతల పట్ల అనుచితంగా మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందరిని పార్టీ నుంచి తొలగించాలని కోరుతూ మహేశ్‌గౌడ్‌కు వారు తొలుత వినతిప్రతం ఇచ్చారు. దీనిపై మహేశ్ గౌడ్ స్పందిస్తూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కాగా, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గరేట్ వైన్ ఓవెన్, బ్రిటిష్ హైకమిషన్ రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు ఎమ్మెల్యే క్వార్టర్స్ క్యాంప్ కార్యాలయంలో మహేశ్ గౌడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం తాజా రాజకీయాలు, హైడ్రా పనితీరు, మూసీ ప్రాజెక్టు, కులగణన-బీసీ రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News