Share News

Abhijit Banerjee: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు

ABN , Publish Date - May 18 , 2025 | 03:38 AM

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డును ఏర్పాటు చేయనుందని, ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రముఖ ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు.

Abhijit Banerjee: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు

  • సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి

  • భాగస్వామ్యం పంచుకోవాలని నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీకి విజ్ఞప్తి

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డును ఏర్పాటు చేయనుందని, ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రముఖ ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. ఇందుకు బెనర్జీ సమ్మతించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో అభిజిత్‌ బెనర్జీ.. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించారు.


శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ విజన్‌ను, ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి గొప్ప విజన్‌తో ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా అభిజిత్‌ బెనర్జీ ప్రశంసించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటిలో ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌, సృజనాత్మకతను భాగం చేయాలని సూచించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్‌ కె. రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 03:38 AM