Share News

CM Revanth Reddy: ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:01 AM

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్‌ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్‌ సఫారీలు ఉన్నాయని, మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే నదులు, జలపాతాలు ఉన్నందున ఉన్న వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

CM Revanth Reddy: ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టండి

అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెరిగేలా సౌకర్యాలు కల్పించాలి

  • అటవీ జంతువుల దాడి బాధితులకు తక్షణ పరిహారమివ్వాలి

  • అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్‌ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్‌ సఫారీలు ఉన్నాయని, మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే నదులు, జలపాతాలు ఉన్నందున ఉన్న వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అటవీ శాఖపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులున్నా తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్‌, తడోబా వంటి ప్రాంతాలకు పులుల సందర్శనకు వెళుతున్నారన్నారు. అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెరిగేలా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు ఈ విషయంలో శ్రద్ధ వహించాలన్నారు.


వరంగల్‌ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అటవీ జంతువుల దాడిలో మృతి చెందిన లేదా గాయపడిన వారికి, పశువులు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి నిధులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అటవీ శాఖ పరిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల విషయంలో అటవీ శాఖ, ఆయా పనులు చేపడుతున్న శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎ్‌ఫఎస్‌ అధికారుల కేటాయింపుపై కేంద్రాన్ని సంప్రదించాలని సీఎ్‌సకు సూచించారు. శాఖలో ప్రమోషన్లు, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ పని తీరు కనబర్చుతున్న వారికి అవార్డులను ఇచ్చే ప్రక్రియను పునరుద్థరించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 04:01 AM