BRS Srinivas Goud: హైదరాబాద్‌లో కల్లు నిషేధిస్తే నగర దిగ్బంధనమే
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:34 AM
హైదరాబాద్‌లో కల్లును నిషేధిస్తే లక్షలాది మందితో నగరాన్ని దిగ్బంధం చేస్తామని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
కల్లును నిషేధిస్తే మద్యనిషేధానికి ఉద్యమం: గౌడ సంఘం
పంజాగుట్ట, జూలై18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కల్లును నిషేధిస్తే లక్షలాది మందితో నగరాన్ని దిగ్బంధం చేస్తామని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కల్లు గీత వృత్తిపై దాడి చేస్తోందని ఆరోపించారు. గౌడ సంఘాల నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లో కల్లు విక్రయాలను నిషేధించగా ఎంతోమంది గీత కార్మికులు రోడ్డున పడ్డారని శ్రీనివా్‌సగౌడ్ తెలిపారు. కూకట్‌పల్లిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు, కార్పొరేటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి 11 మంది చనిపోయారన్నారు.
ఆ కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోకుండా ఓఅర్‌ఆర్ లోపల కల్లు అమ్మకాలు బంద్ చేస్తామని ప్రభుత్వం లీకేజీలు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీకి తాము వ్యతిరేకమని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక, కల్తీ పేరుతో ప్రభుత్వం తమ జాతిని అంతం చేయాలని చూస్తోందని గౌడ్ సంఘాల నాయకులు ఆరోపించారు. తమ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పందించకపోతే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. కల్లును నిషేధిస్తే మద్యాన్ని కూడా నిషేధించాలని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి