Share News

BJP: బండి సంజయ్‌.. విరాట్‌ కోహ్లీ ఆఫ్‌ బీజేపీ

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:29 AM

బీజేపీని ఇండియా క్రికెట్‌ టీంతో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను విరాట్‌ కోహ్లీతోనూ పోలుస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. శనివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు వీటిని ఏర్పాటు చేశారు.

BJP: బండి సంజయ్‌.. విరాట్‌ కోహ్లీ ఆఫ్‌ బీజేపీ

  • కోహ్లీతో పోలుస్తూ కేంద్ర మంత్రి సంజయ్‌ ఫ్లెక్సీలు

  • కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతల అభిమానం

భగత్‌నగర్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీని ఇండియా క్రికెట్‌ టీంతో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను విరాట్‌ కోహ్లీతోనూ పోలుస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. శనివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు వీటిని ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో నగరంలో ఆ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘బండి సంజయ్‌ = విరాట్‌ కోహ్లీ ఆఫ్‌ బీజేపీ’ అని, ‘పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ, కాంగ్రె్‌సపై బండి సంజయ్‌ బెస్ట్‌ పర్‌ఫార్మర్స్‌’ అని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ముద్రించారు. కోహ్లీ, బండి సంజయ్‌ ఫ్లెక్సీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వాటిని మున్సిపల్‌ అధికారులు తొలగించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:29 AM