Share News

BJP: బఫర్‌స్టాక్‌ వివరాలు ఎందుకు చెప్పట్లేదు?

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:52 AM

రాష్ట్రంలో యూరి యా బఫర్‌ స్టాక్‌ గురించి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు

BJP: బఫర్‌స్టాక్‌  వివరాలు ఎందుకు చెప్పట్లేదు?

  • యూరియాపై కాంగ్రెస్‌ అసత్య ప్రచారం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరి యా బఫర్‌ స్టాక్‌ గురించి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీ వద్ద బఫర్‌ స్టాక్‌ ఉంచుకుని, కేంద్రం యూరియా ఇవ్వడం లేదని ఎందుకు ప్రచారం చేస్తున్నరు? రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా యూరియా కృత్రిమ కొరత ఏర్పడింది. నేను చెప్పినదాంట్లో ఒక్క అక్షరం తప్పుంటే రాజీనామా చేస్తా.. లేకుంటే మీరు రాజీనామా చేయాలి’ అని మంత్రి తుమ్మలకు రాంచందర్‌రావు సవాల్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో గతేడాది 3 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం జరిగితే, ఈసారి సాగు విస్తీర్ణం పెరగకున్నా యూరి యా డిమాండ్‌ గతం కంటే ఎక్కువ ఎందుకు పెరిగిందో తుమ్మల సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూరి యా కేటాయింపులపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. యూరియా కేటాయింపులపై రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ తక్కువ చేయలేదని, దీనిపై చర్చకు రావాలని తాను గతంలో సవాల్‌ చేసినా కాంగ్రెస్‌ నాయకులు ముందుకు రాలేదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం 2025 రబీ సీజన్‌కు తెలంగాణాకు 12.47 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసింది.


ఇందులో రాష్ట్రప్రభుత్వం 10.43 లక్షల మెట్రిక్‌ టన్ను లు పంపిణీ చేయగా, 2.04 లక్షల మెట్రిక్‌ టన్నులు ఖరీ్‌ఫకు ప్రారంభ నిల్వగా ఉంది. ఈ ఖరీఫ్‌కు కేంద్రం 5.18 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసిం ది. అంటే, ఇప్పటివరకు (ఈనెల 14 వరకు) రాష్ట్ర ప్రభుత్వం వద్ద 7.22 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉం ది’ అని అన్నారు. ‘ఇదీ వాస్తవమయితే, మంత్రి తుమ్మల మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ 3 నెలల కిందటే ప్రకటన చేశారు. దీంతో రైతులు ఎరువుల దుకాణాలకు క్యూ కట్టారు. దళారులు బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు’ అని అన్నారు. ‘రామగుండం, క్రిబ్‌కో, ఇఫ్కో నుంచి 15 వేల మెట్రిక్‌ టన్నులు, కరీకల్‌ పోర్టు నుంచి మరో 10 వేల మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతోంది. ఇదంతా కూడా మీ ఒత్తిడితో కాదు.. మా బాధ్యతగా ఇస్తున్నం’అని పేర్కొ న్నారు. కాగా, మార్వాడీ గోబ్యాక్‌ నినాదం వెనుక అర్బన్‌ నక్సల్స్‌ ఉన్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. ఈ నినాదం వెనుక కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు కూడా ఉన్నారన్నారు. ‘మా పార్టీ సీనియర్‌ బీసీ నేత బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిగా చేయాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కోరిన సీఎం రేవంత్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ బీసీ సీనియర్‌ నేత వీహెచ్‌ను ఎందుకు ప్రతిపాదించలేదు?’ అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు కాంగ్రె్‌సకు తెలుగు ప్రైడ్‌ ఏమైందని నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 04:52 AM