Share News

BJP: బీసీలకు కాంగ్రెస్‌ మోసం: లక్ష్మణ్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:24 AM

బీసీలను మోసం చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. కమిషన్‌లపేరుతో కాంగ్రెస్‌ కాలయాపన చేసిందే తప్ప బీసీలకు న్యాయం చేయలేదని విమర్శించారు.

BJP: బీసీలకు కాంగ్రెస్‌ మోసం: లక్ష్మణ్‌

  • బీసీ రిజర్వేషన్లపై ఏదీ స్పష్టత?: రాంచందర్‌రావు

  • బీజేపీలో చేరిన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీసీలను మోసం చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. కమిషన్‌లపేరుతో కాంగ్రెస్‌ కాలయాపన చేసిందే తప్ప బీసీలకు న్యాయం చేయలేదని విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, లక్ష్మణ్‌ సమక్షంలో బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌, సామాజికవేత్త వకుళాభరణం కృష్ణమోహన్‌రావు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘కులగణన సర్వే ఎవరి కోసం చేశారు? బీసీల కోసమా? ముస్లింల కోసమా?’ అని నిలదీశారు. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్‌ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్న ఆయన.. ఇందులో ఇతర మతస్తులకు అవకాశం ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదనే నమ్మకంతోనే తాను పార్టీలో చేరినట్టు కృష్ణమోహన్‌ రావు స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు కృష్ణమోహన్‌ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ శాలువా కప్పి అభినందించారు.


ఐఆర్‌డీఏఐలో రూ.5.30 కోట్ల మోసం

  • మోసానికి పాల్పడిన ఉద్యోగి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రాంతీయ కార్యాలయంలో నిధులు గోల్‌మాల్‌ చేసిన ఉద్యోగిని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఐఆర్‌డీఏఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌ భాస్కరభట్ల సూర్యనారాయణ శాస్త్రి తన అప్పులను తీర్చడం కోసం సంస్థ నిధులను మళ్లించాడు. నకిలీ ఇన్వాయిసులు, కొటేషన్లు, ఇతర పత్రాలను సృష్టించి, ఐఆర్‌డీఏఐకు చెందిన అసలు విక్రేతల బ్యాంకు ఖాతాల వివరాల స్థానంలో అతడి కుటుంబసభ్యుల వివరాలను పేర్కొని నేరానికి పాల్పడ్డాడు. నోట్‌ ఫైళ్లను ఉన్నతాధికారులు ఆమోదించడంతో అకౌంట్స్‌ విభాగం ఉద్యోగులు కూడా వాటికి సంబంధించిన చెల్లింపులు చేశారు. ఈ చెల్లింపులన్నీ చట్టబద్ధమైన విక్రేతలకే చేరుతున్నాయని నమ్మి నిందితుడి కుటుంబసభ్యుల ఖాతాలకు డబ్బులను బదిలీ చేశారు. ఈ విధంగా నిందితుడు రూ.5.30 కోట్ల వరకు మళ్లించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అతడిపైౖ కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ఎ.ముత్యంరెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 02:24 AM