Share News

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN , Publish Date - Oct 16 , 2025 | 06:51 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌(Electricity) సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ నందినగర్‌, మీనాక్షి ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

- నగరంలో నేడు విద్యుత్‌ అంతరాయం

హైదరాబాద్: బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌(Electricity) సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ నందినగర్‌, మీనాక్షి ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ సీఓడీ ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11కేవీ ఆంధ్రా బ్యాంక్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

బాలానగర్‌: మరమ్మతుల కారణంగా బీబీఆర్‌ ఫీడర్‌ పరిధిలో నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఐడీపీఎల్‌‌ విద్యుత్‌ అధికారులు ఓప్రకటనలో తెలిపారు. బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా నుంచి బీహెచ్‌ఈఎల్‌ ఆర్‌అండ్‌డీ, అంబికా కాలనీ వరకు గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్‌ సరఫరా ఉండదన్నారు.


సంతోష్‌నగర్‌: టీఎస్ఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 11కేవీ శారదనగర్‌, గణేష్ నగర్‌, గ్రీన్‌హిల్స్‌, లక్ష్మీనగర్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో నిర్వహణపనుల కారణంగా గురువారం విద్యుత్‌సరఫరా నిలిపి వేస్తున్నట్లు డీఈ తెలిపారు. 11కేవీ శారదనగర్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల, గణేష్ నగర్‌, గ్రీన్‌హిల్స్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, లక్ష్మీనగర్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.


city1.2.jpg

చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11కేవీ సబ్‌స్టేషన్‌ మరమ్మతుల కారణంగా గురువారం ఫలక్‌నుమా సబ్‌డివిజన్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు. బీఎన్‌కే కాలనీ ఫీడర్‌ పరిధిలోని ఖాజానగర్‌, ఈద్గా, బీఎన్‌కే కాలనీ, చత్రినాక ఫీడర్‌ పరిధిలోని ఛత్రినాక, బోయిగూడ, శ్రీరాం నగర్‌, మగ్దూంపురా, గౌలిపురా, మురాద్‌ మహల్‌, బాలాగంజ్‌, లాల్‌దర్వాజ, శారద కాలేజీ ఫీడర్‌ పరిధిలోని ఆలియాబాద్‌, రాజన్నబావి, శారద కాలేజీ, భారత్‌ కోట ఫీడర్‌ పరిధిలోని చర్చి బాబానగర్‌, సీ- బ్లాక్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్టు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 06:52 AM