Share News

Bhatti Vikramarka: మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - May 13 , 2025 | 04:41 AM

విద్యుదుత్పత్తిలలో తెలంగాణ స్వయం ఉత్పత్తిదారుగా ఉండటమే కాకుండా మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అభివృద్థి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం

  • విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి నేను ముందుంటా!

  • లైన్మెన్‌ నుంచి సీఎండీ వరకు ఒకే యూనిఫామ్‌: భట్టి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మే 12(ఆంధ్రజ్యోతి): విద్యుదుత్పత్తిలలో తెలంగాణ స్వయం ఉత్పత్తిదారుగా ఉండటమే కాకుండా మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అభివృద్థి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌) ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ సిబ్బందితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్తుఉద్యోగులు రాష్ట్రాన్ని తమ కుటుంబం అనే భావనతో పనిచేస్తుండటంతోనే ప్రభుత్వం నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయగలిగిందని ఆయన తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విద్యుదుత్పత్తి ఉండదన్నవారి దుష్ప్రచారానికి చెంపపెట్టులా మార్చిలో 17,162 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినప్పటికీ ఒక్క క్షణం కూడా అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయడం గర్వకారణం’’ అని భట్టి వ్యాఖ్యానించారు.


విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ, వారిసేవలను గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్తు రంగ సిబ్బందికి నిఫ్ట్‌తో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి యూనిఫామ్‌ ఇవ్వాలని ప్రభుత్వం యోచన చేస్తోందని వెల్లడించారు. ‘‘లైన్మెన్‌ నుంచి సీఎండీ వరకు ఒకే తరహా డ్రెస్‌ ఉండేలా చర్యలు తీసుకుంటాం. మనందరం ఒకే కుటుంబమన్న భావన కలిగించేందుకు ఇది ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు. విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మౌలిక రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి రీజినల్‌ రింగ్‌ రోడ్‌, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్‌ సిటీ వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి తానే ముందుంటానని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కౌలు రైతులకు శుభవార్త..

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 04:41 AM