Bhadrachalam: భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్‌వో సర్టిఫికెట్
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:31 PM
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరో అరుదైన ఘనతను సాధించింది. దక్షిణ అయో ధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్టైజేషన్ (ఐఎస్‌వో) గుర్తింపు లభించడం విశేషం.
పత్రాలను ఈవోకు అందజేసిన దేవాదాయశాఖ మంత్రి సురేఖ
భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరో అరుదైన ఘనతను సాధించింది. దక్షిణ అయో ధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్టైజేషన్ (ఐఎస్‌వో) గుర్తింపు లభించడం విశేషం. ఐఎస్‌వో 9001:2015, 22000:2018 సర్టిఫికెట్లను దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి(EO L Ramadevi)కి రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ, ఐఎస్‌వో డైరెక్టర్ శివయ్య హైద రాబాద్‌లో మంగళవారం అందజేశారు. ఈ సర్టిఫికెట్లు ప్రసాదాల తయారీ, ఆహార భద్రత, నిర్వాహణ స్థాయి పాటించడంతో ఈ గుర్తింపు లభించింది.

గతనెల 29న ఐఎస్‌వో బృందం దేవస్ధానంలోని పలు విబాగాలను పరిశీలిం చారు. ఈ నేపథ్యంలో ఐఎస్‌వో గుర్తింపు లభించడంతో దేవస్ధానం అధికా రులు, వైదిక పరిపాలన సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) గుర్తింపు ఉంది. అలాగే ఇటీవల దేవస్థానం స్వామి వారి చిత్రాలకు సంబంధించి కాపీరైట్ హక్కులను కూడా సాధించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News