Share News

Fake Tickets: బల్కంపేట ఆలయంలో నకిలీ టికెట్ల అమ్మకాలు వాస్తవమే:ఈవో

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:38 AM

టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది షిప్టులను మార్చామని ఆయన చెప్పారు. ఈవో మాత్రం టికెట్ల అమ్మకాల్లో కొంత డ బ్బు దారి మళ్లిన విషయం వాస్తవమేనని చెబుతున్నారు.

Fake Tickets: బల్కంపేట ఆలయంలో నకిలీ టికెట్ల అమ్మకాలు వాస్తవమే:ఈవో

అమీర్‌పేట, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. కొన్నాళ్లుగా టికెట్ల విక్రయాల్లో అక్కమాలు చోటు చేసుకుంటున్నాయని ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న సిబ్బంది, పూజారులను అధికారులు మారిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకుని అక్కడే తిష్ఠ వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత కొంతకాలంగా సిబ్బంది తమ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆలయ సూపరింటెండెంటే చెబుతున్నారు.


టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది షిప్టులను మార్చామని ఆయన చెప్పారు. ఈవో మాత్రం టికెట్ల అమ్మకాల్లో కొంత డ బ్బు దారి మళ్లిన విషయం వాస్తవమేనని చెబుతున్నారు. కాగా ఒకేరోజు నకిలీ టికెట్ల ద్వారా 31 వేలు వసూలైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన సూపరింటెండెంట్‌ ప్రింటింగ్‌లో పొరపాటు జరిగిందని చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:38 AM