Share News

Krishna Water: మూడో దశ టెలిమెట్రీకి ఒప్పుకోం!

ABN , Publish Date - May 09 , 2025 | 03:59 AM

కృష్ణా జలాల తరలింపుపై లెక్కలు తీయడానికి వీలుగా అదనపు టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించబోమని ఏపీ తేల్చి చెప్పింది.

Krishna Water: మూడో దశ టెలిమెట్రీకి ఒప్పుకోం!

  • కృష్ణా బోర్డుకి తేల్చిచెప్పిన ఏపీ ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల తరలింపుపై లెక్కలు తీయడానికి వీలుగా అదనపు టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించబోమని ఏపీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గత మార్చి 10వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి లేఖ రాశారు. దీనిపై అభిప్రాయం తెలుపాలంటూ ఈ నెల 6న కృష్ణా బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాసింది.


ఈ నేపథ్యంలో, ఏపీ లేఖలోని వివరాలు వెల్లడయ్యాయి. కృష్ణా జలాల తరలింపునకు సంబంధించి ఏపీ పరిధిలోని 11 కాంపోనెంట్లపై.. మూడో విడత కింద అదనపు టెలీమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీని తెలంగాణ గతంలో కోరింది. దీనిపైనే ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:59 AM