ప్రజల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:23 PM
ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌లతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్నారం మండలం కవ్వాల్ పులుల అభయారణ్యం అభివృద్ధి, వన్య ప్రాణు ల సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల రక్షణకు కృషి చేస్తోం దన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌లతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్నారం మండలం కవ్వాల్ పులుల అభయారణ్యం అభివృద్ధి, వన్య ప్రాణు ల సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల రక్షణకు కృషి చేస్తోం దన్నారు. కవ్వాల్ అభయారణ్యం పరి ధిలోకి వచ్చే మల్యాల గ్రామంలో నివసించే 103 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రతిపా దించామన్నారు. గ్రామస్థుల పునరా వాసం, నష్టపరిహారం సౌకర్యాల కల్ప నపై అందిన అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు. డీఈవో యాదయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు
హాజీపూర్, (ఆంధ్ర జ్యోతి): ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకొంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పా టు చేసిన స్ర్టాంగ్ రూమ్ నుంచి నస్పూర్‌లోనీ ఈవీఎం గోదాముకు తరలింపు ప్రక్రియను అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, చెన్నూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధు ల సమక్ష్యంలో చేపట్టారు. కలెక్టర్ మా ట్లాడుతూ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌రూం నుంచి ఈవీఎం లను కట్టుదిట్టమైన భద్రత మధ్య నస్పూర్‌లోనీ ఈవీఎం గోదాములకు తరలించామన్నారు.