Share News

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:49 PM

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. శనివా రం నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట గ్రామాల్లో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే హరితహారం కోసం మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

వేమనపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. శనివా రం నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట గ్రామాల్లో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే హరితహారం కోసం మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో మునగ, వెదురు, ఈత, తాడి, నీలగిరి మొక్కలను పెంచాలన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగం గా ఫాంఫాండ్‌ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. రూ.300 గరిష్ట వేతనం పొందాలని, ప్రతీ జాబ్‌ కార్డుదారుడు వంద రోజులు పని పూర్తి చేసుకోవాలన్నారు. ముల్కలపేట గ్రామపంచాయతీలో ఇందిరాక్రాంతి పథకంలో మంజూరైన ఊర కోళ్ల పెంపకాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఎంపీడీవో శ్రీని వాస్‌, ఏపీవో సత్యప్రసాద్‌, ఏపీఎం ఉమారాణి, ఈసీ మధుకర్‌, కార్యదర్శులు అశోక్‌, జాపర్‌, పాల్గొన్నారు.

కోటపల్లి, (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం ద్వారా చేపడు తున్న పనులు నాణ్యతగా ఉండాలని డీఆర్‌డీవో కిషన్‌ అన్నారు. శనివారం మల్లంపేట, సర్వాయిపేట గ్రామాల్లో నర్సరీలు, పశువుల పాకల పనులను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల ఎదుగుదలకు చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారు. ఎంపీడీవో లక్ష్మయ్య, ఏపీవో వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 10:49 PM