ఎస్టీపీపీకి సేఫ్టీ అవార్డు
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:55 PM
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు ఆదివారం పేర్కొన్నారు.

జైపూర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు ఆదివారం పేర్కొన్నారు. ఈ నెల 11న న్యూఢిల్లీలో జరిగిన గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు 2025 పురస్కారంలో ఎస్టీపీపీ ప్రతిష్టాత్మక సేఫ్టీ అవార్డు లభించిందన్నారు.
ఎస్టీపీపీలో జీరో యాక్సిడెంట్‌లు, సురక్షిత ప్రణాళికలు, ఆధునిక సాంకేతిక వినియోగం, పరిసరాల పరిరక్షణకు తీసుకుం టున్న చర్యలకు అవార్డు వచ్చిందని తెలిపారు. వివేక్ శ్రీవాత్సవ ఐపీఎస్ అధికారి నుం చి ఎస్టీపీపీ అధికారులు ధరావత్ పంతుల, అవినాష్‌దూబే, పులి సురేష్‌లు అందుకు న్నారు. సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలార్ జీఎం జానకిరామ్ అధికారులు, ఉద్యోగులను అభినందించారు.