Share News

తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:12 PM

ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రక్రియ పూర్తి చేసుకుని తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం చేశామని పరిశీలకులు సురేంద్ర మోహన్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మం దిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లాతో కలిసి సమావేశం నిర్వహించారు.

తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రక్రియ పూర్తి చేసుకుని తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం చేశామని పరిశీలకులు సురేంద్ర మోహన్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మం దిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ 18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. మరణించిన, చిరునామా మారిన, సవరణలు, తొలగింపులపై భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుసరించి చర్యలు తీసుకొన్నా మని తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ముసాయిదా, జాబితా ప్రచురణ, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం దశలు పూర్తి చేసు కుని తుది జాబితా ప్రచురణ అనుమతి కొరకు ఎన్నికల సంఘంకు పంపిం చామని, అనుమతి పొందిన అనంతరం ఈ నెల 6న తుది జాబితా ప్రచురిస్తామన్నారు. క లెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్య క్రమం జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహిం చామని తెలిపారు. జాబితాపై వచ్చిన 434 అభ్యంతరాలు, ఫిర్యా దులు స్వీకరించి 427 పరిష్కరించామన్నారు. కార్యక్ర మంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:12 PM