Share News

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:52 PM

గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణ, డీఈ దశరధంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణ, డీఈ దశరధంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సాగు నీటి విడుదలలో సమస్యలు తలెత్తితే వెంటనే పరి ష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ యాసంగి పంటకు గూడెం ఎత్తిపో తల పథకం ద్వారా విడుదల చేసే నీటిని పద్ధతిగా వినియోగించుకోవాలన్నారు. సాగునీటిని విడుదల చే సేందుకు కార్యాచరణ రూపొందించాలని, నీటి విడుదల చేసే వివరాలను రైతులకు తెలుపాలన్నారు. యాసం గిలో గూడెం ఎత్తిపోతల పథకం కింద 69 వేల ఎకరా లు ఆయకట్టు సాగువుతుందన్నారు. ఏఈఈలు జాకీర్‌, రాజేందర్‌, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శని వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, పోలీసు, రవా ణా అధికారులతో మాట్లాడారు. ఈ నెల 31 వరకు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రహ దారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించా లన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో విజయవంతం చేసే దిశగా అధికారుల సమన్వ యంతో కృషి చేస్తామని తెలిపారు. ఏసీపీ ప్రకాష్‌, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్‌, అధికారులు రాము, రాజేశ్వరి, యాదయ్య, పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 10:52 PM