Share News

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jan 12 , 2025 | 10:58 PM

ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్‌ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

నస్పూర్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్‌ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్‌ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదర్‌రెడ్డి మాట్లా డుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారమ య్యే విధంగా చూస్తానన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో సం ఘం అభ్యర్థులు వంగ మహేందర్‌ రెడ్డి, శ్రీపాల్‌ రెడ్డిలను గెలిపిం చాలన్నారు. పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బచ్చ మోహన్‌రావు, జిల్లా అసోసియేట్‌ అఽధ్యక్షుడిగా మహేశ్వర్‌, రాష్ట్ర అసోసియేట్‌ సభ్యుడిగా తిరుపతయ్య, మీడియా ఇన్‌చార్జీగా కే.తిరు పతిలను ఎన్నుకున్నారు. మోహన్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండు జనార్దన్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షురాలు శాంకరి, ఆసిఫా బాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 10:58 PM