Share News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:24 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురువారం బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీ లించి మాట్లాడారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

బెల్లంపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురువారం బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీ లించి మాట్లాడారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ డెలివరీలు చేస్తున్నామని, గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వైద్యులతోపాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఆసు పత్రిలో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. వైద్యుడు కిరణ్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 10:24 PM