Madhapur dating app crime: గే యాప్ ద్వారా ఛాటింగ్.. హోటల్‌కు వెళ్తే ఛీటింగ్..
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:02 AM
ప్రముఖ గే యాప్ అయిన గ్రైండర్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి చేతిలో మోసపోయిన మరో యువకుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. గ్రైండర్ యాప్ ద్వారా ఇద్దరు యువకులు చాటింగ్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మాదాపూర్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నారు.
ప్రముఖ గే యాప్ అయిన గ్రైండర్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి చేతిలో మోసపోయిన మరో యువకుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. గ్రైండర్ యాప్ ద్వారా ఇద్దరు యువకులు ఛాటింగ్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మాదాపూర్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఇద్దరూ కలవాలని నిర్ణయించుకుని అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు (dating app extortion).
ఆ ఓయో రూమ్‌కు వెళ్లిన తర్వాత డాక్టర్‌పై మరో యువకుడు అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నించాడు (online dating trap). డాక్టర్ నిరాకరించటంతో అతడిపై దాడికి దిగాడు. తనకి డబ్బులు ఇవ్వకుంటే ఇలా ప్రైవేట్ గా కలిసిన విషయాన్ని ఇంట్లో చెబుతానని డాక్టర్‌ను ఆ యువకుడు బెదిరించాడు. దీంతో భయపడిన డాక్టర్ 5000 రూపాయలు చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు.
బయటికి వచ్చాక ఆ డాక్టర్‌ను ఆ యువకుడు ఫాలో అయ్యాడు (Madhapur crime news). డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్ కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గాలింపులు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చేపా చేపా ఎందుకు పెరగట్లే.. మత్స్యకారుల ఆవేదన
బాలికలపై లైంగిక దాడి.. నిందితులు అరెస్ట్
Read Latest Telangana News and National News