Adluri Lakshman: గురుకులాల డైట్ చార్జీలకు రూ.170 కోట్లు
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:48 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అవసరమైన నిధులు విడుదల చేశామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు.
ఏప్రిల్ దాకా బకాయిల నిధులు విడుదల
నెలాఖరుకు విద్యార్థులకు యూనిఫాంలు
ఇకపై ఏ నెలకు ఆ నెల బిల్లుల చెల్లింపు
సాంఘిక సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అవసరమైన నిధులు విడుదల చేశామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. ఇందులో డైట్ చార్జీల కోసం రూ.170 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అలాగే, ఈ నెలాఖరులోగా విద్యార్థులందరికీ యూనిఫాంలు అందిస్తామని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. సంక్షేమ శాఖ అధికారులతో సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆపై, మంత్రి లక్ష్మణ్ వినతి మేరకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా సంక్షేమ శాఖ అధికారులతో ప్రజాభవన్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అడ్లూరి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా విద్యార్థులకు యూనిఫాంలు అందిస్తామని ప్రకటించారు.
అన్ని గురుకుల పాఠశాలలకు 2025 ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బిల్లులు మంజురు చేశామని వెల్లడించారు. డైట్ చార్జీల కోసం రూ.170 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అలాగే, అద్దె బకాయిలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కావాల్సిన నిధులు కూడా మంజూరు చేసినట్టు వెల్లడించారు. అన్ని గురుకులాల్లోని ఉద్యోగుల వేతనాల కోసం రూ.100 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇకపై బకాయిలు లేకుండా ప్రతి నెలా డైట్, అద్దె బిల్లులను చెల్లిస్తామని ప్రకటించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అడ్లూరి వివరించారు. పాఠశాలల్లో ప్రతి రోజు ఉదయం జరిగే అసెంబ్లీలో మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి అడ్లూరి చెప్పారు.
చేనేత రుణమాఫీకి రూ.33 కోట్లు
చేనేత కార్మికుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 33 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ మేరకు చేనేత జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇవి కూడా చదవండి:
ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
For More Telangana News and Telugu News