Child Marriage: 40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు వివాహం
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:10 AM
మైనర్ బాలిక 13కు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. అనంతరం ఆ బాలిక తాను చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి
బాలిక ఫిర్యాదుతో ఆమె తల్లి, మరో ముగ్గురిపై కేసు నమోదు
నందిగామ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మైనర్ బాలిక (13)కు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. అనంతరం ఆ బాలిక తాను చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి న్యాయం చేయాలని ప్రాధేయపడింది. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళకు ఒక కూతురు,కుమారుడు ఉన్నారు. భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఆమె కూతురు ప్రభు త్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కుటుంబ పోషణ భారమవడంతో కూతురికి పెళ్లి చేసేందుకు మధ్యవర్తిని సంప్రదించగా.. అతను రంగారెడ్డి జిల్లా చేవెళ్లమండలం కందవాడకు చెందిన 40ఏళ్లకి ఆస్తి బాగా ఉందంటూ సంబంధం తెచ్చాడు. దీంతో మే 28న వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఇష్టం లేని పెళ్లి చేశారని, చదువుకుంటానంటూ మంగళవారం బాలిక.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తెలిపింది. ఆయన నందిగామ తహసీల్దార్ వద్దకు బాలికను తీసుకెళ్లగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లితో పాటు పెళ్లికొడుకు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News