Godavari Cauvery Link: గోదావరి కావేరీ లింకుతో..కృష్ణా బేసిన్‌లో రెండు రిజర్వాయర్లు..!
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:13 AM
గోదావరి కావేరీ అనుసంధానం జీసీ లింక్ లో వాటాగా వచ్చే నీటిని సమ్మక్కసాగర్ బ్యారేజీ తుపాకులగూడెం పరిసరాల్లో కాక కృష్ణా బేసిన్‌లో 2 రిజర్వాయర్లు కట్టుకొని, వినియోగించుకోవాలని..
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధానం(జీసీ లింక్)లో వాటాగా వచ్చే నీటిని సమ్మక్కసాగర్ బ్యారేజీ(తుపాకులగూడెం) పరిసరాల్లో కాక కృష్ణా బేసిన్‌లో 2 రిజర్వాయర్లు కట్టుకొని, వినియోగించుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుగుతుండగా.. ఏడాదిలోపు తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కృష్ణా ట్రైబ్యునల్ నీటిని కేటాయించని ప్రాంతాల్లో జీసీ లింకు వాటా వినియోగానికి రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఛత్తీ్‌సగఢ్ వినియోగించుకోని వాటా నుంచి 147 టీఎంసీలను జీసీ లింకుకు తొలిదశలో తరలించాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్ణయించింది. ఇందులో తెలంగాణకు 45, ఏపీకి 43, తమిళనాడుకు 40.8, కర్ణాటకకు 15.9, పుదుచ్చేరికి 2.3 చొప్పున టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే..! తెలంగాణ వాటాను ఏ బేసిన్‌లోనైనా వాడుకునే స్వేచ్ఛనివ్వాలనే సర్కారు విజ్ఞప్తికి ఎన్‌డబ్ల్యూడీఏ ఇదివరకే సమ్మతించింది.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News