Share News

OpenAI Acquisition: రూ.5 లక్షల కోట్లతో ఓపెన్ ఏఐ బిగ్ డీల్..ఏఐ పరికరాల స్టార్టప్ కొనుగోలు..

ABN , Publish Date - May 22 , 2025 | 01:19 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఐఫోన్ డిజైనర్ జోనీ ఐవ్ స్థాపించిన ప్రముఖ హార్డ్‌వేర్ కంపెనీ 'io'ని 6.5 బిలియన్ డాలర్ల భారీ మొత్తం (రూ. 5,56,92,97,91,600)తో కొనుగోలు (OpenAI Acquisition) చేసింది. దీంతో ఓపెన్‌ఏఐ తన సామర్థ్యాలను మరింత విస్తరించనుంది.

OpenAI Acquisition: రూ.5 లక్షల కోట్లతో ఓపెన్ ఏఐ బిగ్ డీల్..ఏఐ పరికరాల స్టార్టప్ కొనుగోలు..
OpenAI Acquisition

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రముఖ సంస్థ ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఐఫోన్ డిజైనర్ జోనీ ఐవ్ స్థాపించిన హార్డ్‌వేర్ కంపెనీ 'io'ని దాదాపు 6.5 బిలియన్ డాలర్లతో (రూ. 5,56,92,97,91,600) కొనుగోలు (OpenAI Acquisition) చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఐవ్, స్కాట్ కానన్, ఎవాన్స్ హాంకీ, టాంగ్ టాన్ వంటి మాజీ ఆపిల్ ఇంజినీర్లు ఓపెన్‌ఏఐలో చేరనున్నారు. జోనీ ఐవ్, 1992 నుంచి 2019 వరకు ఆపిల్‌లో ముఖ్యమైన డిజైనర్‌గా పనిచేశారు. ఆయన డిజైన్ చేసిన ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తులు టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తూ, వినియోగదారుల అనుభవాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లాయి.


స్క్రీన్‌లేని భవిష్యత్తు

ఈ క్రమంలో 2019లో ఐవ్ తన స్వంత డిజైన్ సంస్థ 'లవ్‌ఫ్రం'ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఆయన ఫెరారీ, ఎయిర్‌బీఎన్‌బీ వంటి ప్రముఖ బ్రాండ్లతో సహకరించారు. ఈ క్రమంలోనే ఓపెన్‌ఏఐతో ఐవ్, లవ్‌ఫ్రం రెండు సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా, ఓపెన్‌ఏఐ తన ఉత్పత్తుల డిజైన్‌ను లవ్‌ఫ్రం ద్వారా చేయించుకోనుంది. అయితే, లవ్‌ఫ్రం మాత్రం స్వతంత్ర సంస్థగా కొనసాగుతుంది. ఓపెన్‌ఏఐ, లవ్‌ఫ్రం కలిసి అభివృద్ధి చేస్తున్న కొత్త ఉత్పత్తి, స్క్రీన్‌లేని కంప్యూటింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడమే లక్ష్యం. ఈ ఉత్పత్తి, స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యామ్నాయం మత్రమే కాదు, వాటిని పూర్తిగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారు.


భవిష్యత్తులో

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఈ ఉత్పత్తిని ప్రపంచం చూసే అత్యంత శక్తివంతమైన సాంకేతిక పరికరంగా అభివర్ణించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న AI హార్డ్‌వేర్ ఉత్పత్తులు, వినియోగదారుల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. హ్యూమేన్ పిన్, రాబిట్ R1 వంటి ఉత్పత్తులను చాలా దారుణమైన ఉత్పత్తులుగా పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ, లవ్‌ఫ్రం కలిసి అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తి, స్క్రీన్‌లేని కంప్యూటింగ్ అనుభవాన్ని అందించడం.ఈ ఉత్పత్తి, వినియోగదారుల అనుభవాన్ని మరింత సహజంగా, సులభంగా మార్చడానికి డిజైన్ చేస్తున్నారు.


పోటీగా మరిన్ని..

ఓపెన్‌ఏఐ, జోనీ ఐవ్ మధ్య ఈ భాగస్వామ్యం, టెక్నాలజీ ప్రపంచంలో కొత్త దిశను సూచిస్తుంది. స్క్రీన్‌లేని కంప్యూటింగ్ అనుభవం, వినియోగదారుల అనుభవాన్ని మరింత సహజంగా మార్చడానికి అవకాశం కల్పిస్తుంది. 2026లో ఈ ఉత్పత్తి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో టెక్నాలజీ ప్రపంచంలో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అయితే దీనికి పోటీగా ఇతర టెక్ సంస్థలు వస్తాయా లేదా అనేది చూడాలి మరి. ఇప్పటికే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇలాంటి మోడల్స్ అనేకం మార్కెట్లోకి వచ్చాయి.


ఇవీ చదవండి:

కర్ని ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ..

పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 01:21 PM