Karni Mata Temple: కర్ణి మాత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ..దీని స్పెషల్ ఏంటంటే..
ABN , Publish Date - May 22 , 2025 | 12:17 PM
దేశంలో ఎలుకల ఆలయం గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. తాజాగా ప్రధాని మోదీ ఈ ఆలయం (Karni Mata Temple) సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ టెంపుల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ఈరోజు రాజస్థాన్ బికనర్ జిల్లా దేశ్‌నోక్‌లో ఉన్న కర్ణి మాత ఆలయాన్ని (Karni Mata Temple) సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎలుకల ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో 25,000పైగా ఎలుకలు తిరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు ఈ ఎలుకలను "కాబా" అని పిలుస్తారు. వీటిని పూజించడం వల్ల వారికి మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ ఎలుకలను కర్ణి మాతకు పూర్వ జన్మలో చేసిన సేవకు ఆత్మలని చెబుతుంటారు. అక్కడ తెల్ల ఎలుకలు కూడా ఉంటాయని, వాటిని పవిత్రమైనవిగా భావిస్తామని అక్కడి ప్రజలు అంటున్నారు.
పవిత్రమైన స్థలంగా
కర్ణి మాత 1387లో ఒక చరణ కుటుంబంలో పుట్టారు. ఆమె అసలైన పేరు రిఘుబాయి. ఆమె మొదటి వివాహం శతికా గ్రామంలో ఉన్న దేపాజీ చరణ్‌తో జరిగింది. అయితే ఆమె సంపూర్ణ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుని, దైవిక విధానాలను అనుసరించింది. కుటుంబాన్ని సురక్షితం చేయడానికి తన జ్యేష్ట సోదరి గులాబ్‌ను తన భర్తతో వివాహం చేసింది. ఈ విధంగా కర్ణి మాత తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేస్తూ, ధర్మకోసం జీవించిందని చెబుతున్నారు. ఆమె పవిత్రత, ఆధ్యాత్మికత వల్ల ఆమెను కర్ణి మాతగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో ఆమె విగ్రహం, పూజా స్థలాలు పవిత్రమైన స్థలంగా భావిస్తున్నారు.
లక్ష్మణుడి మరణం తర్వాత
ప్రాచీన కథల ప్రకారం, కర్ణి మాత తన సవతి కుమారుడైన లక్ష్మణుడు మరణించిన తర్వాత, అతనికి తిరిగి జీవితం ఇవ్వాలని యముడి దగ్గర ఆమె అపారమైన భక్తిని ప్రదర్శించింది. ఆమె భక్తికి స్పందించిన యముడు లక్ష్మణ్‌ను ఎలుకగా పునరుద్ధరించాడు. ఈ సంఘటన, కర్ణి మాత అచంచల భక్తి, పవిత్రతకు ప్రతీక అని చెబుతున్నారు. ఈ విశ్వాసం ప్రకారం, కర్ణి మాతకి చెందిన ఆత్మలు కూడా ఎలుకల రూపంలో తిరిగి వస్తాయని చెబుతున్నారు. ఈ ఎలుకలను చూసినట్లయితే, అత్యంత శుభసూచకమని ప్రజల నమ్మకం.
మరింత ప్రత్యేకం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో, ఈ కర్ణి మాత ఆలయాన్ని సందర్శించడం ఇప్పుడు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణి మాత ఆలయం దశాబ్దాలుగా అనేక భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతి రోజు కూడా అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తుంటారు. కర్ణి మాత ఆలయ సందర్శన తరువాత, ప్రధాని మోదీ దేశ్‌నోక్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ పునర్నిర్మాణం ద్వారా ప్రాంతీయ రైలు సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. దేశ్‌నోక్-బికనర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కూడా ఈ పర్యటనలో భాగంగా ఉంది.
ఇవీ చదవండి:
పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..
విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్‌కు తప్పిన ఘోర ప్రమాదం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి