ChatGPT: డీప్‌సీక్‌కు పోటీగా చాట్‌జీపీటీ నుంచి కొత్త ఫీచర్..

ABN , First Publish Date - 2025-02-03T11:15:02+05:30 IST

చాట్‌బాట్ ఏఐ రంగంలో చైనా డీప్‌సీక్‌కు పోటీ ఇచ్చేందుకు చాట్‌జీపీటీ సిద్ధమైంది. ఈ క్రమంలో "డీప్ రీసెర్చ్" అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తుందనే వివరాలను ఇక్కడ చూద్దాం.

ChatGPT: డీప్‌సీక్‌కు పోటీగా చాట్‌జీపీటీ నుంచి కొత్త ఫీచర్..
ChatGPT Deep Research

ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా DeepSeekకు పోటీగా చాట్‌బాట్ AI సిద్ధమైంది. ఈ క్రమంలోనే US టెక్ దిగ్గజం OpenAI సోమవారం "డీప్ రీసెర్చ్" అనే ChatGPT ఫీచర్‌ను ఆవిష్కరించింది. డీప్ రీసెర్చ్ అనేది OpenAI నెక్ట్స్ ఫీచర్ అని చెబుతున్నారు. ఇది మీ కోసం స్వతంత్రంగా పని చేస్తుందని అంటున్నారు. మీరు దీనికి ప్రాంప్ట్ ఇస్తే ChatGPT పరిశోధన విశ్లేషకుడి స్థాయిలో సమగ్ర నివేదికను రూపొందించడానికి అనేక ఆన్‌లైన్ వనరులను విశ్లేషించుకుని సమాచారం ఇస్తుందని OpenAI తన ప్రకటనలో తెలిపింది.


అధిక స్థాయిలో..

టోక్యోలో ఉన్నత స్థాయి సమావేశాలకు ముందు, అమెరికా టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐ (OpenAI) "డీప్ రీసెర్చ్" అనే ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా ChatGPT అగ్రగామి సాంకేతికతతో మామూలు అన్వేషణలను మరింత అధిక స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం, చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్ (DeepSeek)కు ఎక్కువ ఆదరణ వస్తున్న నేపథ్యంలో.. ChatGPT కొత్తగా "డీప్ రీసెర్చ్" అనే ఫీచర్‌తో ముందుకు వచ్చింది.


దీని స్పెషల్ ఏంటంటే..

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పరిశోధనలలో నిపుణుల స్థాయిలో సవరణలు, విశ్లేషణలు చేసి నాణ్యతతో కూడిన నివేదికలను రూపొందిస్తుందని తెలిపింది. ఇది పరిశోధనలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఆధునిక AI సామర్థ్యాలను వినియోగించుకుని, పరిశోధన చేసే వ్యక్తులకు సమర్థవంతమైన వనరులను అందిస్తుందని అంటున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో ChatGPT మరిన్ని ఇన్నోవేటివ్ స్ట్రాటజీలను కూడా మీ ముందుకు తీసుకువస్తుందని అంటున్నారు. ప్రత్యేకంగా దీనిని వ్యాపార, విద్య, ప్రభుత్వ రంగాలలో ఎక్కువగా వాడుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.


డీప్‌సీక్‌తో పోల్చితే..

చైనా నుంచి వచ్చిన DeepSeek, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నప్పటికీ, OpenAI ఈ కొత్త టూల్‌ను విడుదల చేయడం ద్వారా అంతర్జాతీయంగా దీనికి పోటీగా వచ్చిందని చెప్పవచ్చు. DeepSeek ప్రధాన లక్ష్యం యూజర్లకు అధిక నాణ్యతతో సులభంగా వినియోగించుకునే పరిశోధన ఫలితాలను అందించడం. ఈ కొత్త టూల్స్ ద్వారా OpenAI మరింత ఆధునిక పరిశోధనలో ఇన్నోవేటివ్ ఆలోచనలు అందించనున్నట్లు చెబుతోంది. ఈ క్రమంలో డీప్ రీసెర్చ్ AI ఫీచర్ వినియోగం ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


ఇవి కూడా చదవండి:

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..


ChatGPT: వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ నుంచి వీడియో ఇంటరాక్షన్ ఫీచర్‌

Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...

For More Technology News and Telugu News

Updated Date - 2025-02-03T11:15:47+05:30 IST