Share News

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..

ABN , Publish Date - Feb 06 , 2025 | 02:49 PM

ఇటివల మార్కెట్లోకి వచ్చిన చాట్‌ జీపీటీ, డీప్‌సీక్ వల్ల డేటా భద్రత విషయంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు వీటి వాడకాన్ని నిషేధించాయి.

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..
ChatGPT and Deepseek Banned

చాట్ జీపీటీ (ChatGPT), డీప్‌సీక్ (Deepseek) ఏఐ టూల్స్ గురించి కీలక అప్‌‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని లేదా ఉపయోగించవద్దని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారులు, ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందిని ఆదేశించింది. ఇవి డేటా గోప్యతా విషయంలో ఇబ్బందులను కలిగిస్తాయని తెలిపింది. ఏఐ వాడకం విషయంలో అగ్రస్థానంలో ఉన్న చాట్ జీపీటీ, ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా డీప్‌సీక్‌ లపై కొన్ని ప్రభుత్వాలు నిఘాను పెంచాయి. ఈ క్రమంలో వీటి వినియోగాన్ని పలు దేశాలు నిషేధించాయి.


పరిశోధకులు ఏమన్నారంటే..

అయితే డీప్‌సీక్ చాట్‌బాట్ వెబ్ లాగిన్ పేజీలో భారీగా అస్పష్టమైన కంప్యూటర్ స్క్రిప్ట్ ఉందని భద్రతా పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. దానిని డీ క్రిప్ట్ చేసినప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ సంస్థ చైనా మొబైల్ కంప్యూటర్ కనెక్షన్‌లను చూపిస్తుందన్నారు. దీని గోప్యతా విధానంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని సర్వర్‌లలో డేటాను నిల్వ చేసినట్లు డీప్‌సీక్ అంగీకరించింది. కానీ చాట్‌బాట్ చైనా మొబైల్‌ లింకుల ద్వారా చైనా రాష్ట్రంతో నేరుగా ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనేక దేశాలు డీప్‌సీక్ వినియోగం విషయంలో ఆంక్షలు విధించాయి.


ఈ దేశాల్లో కూడా..

ఈ క్రమంలో దక్షిణ కొరియా కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానించిన సైనిక కంప్యూటర్‌లలో డీప్‌సీక్‌ యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేసినట్లు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు జనవరిలో ప్రపంచంలోనే డీప్‌సీక్ AIని నిషేధించిన తొలి దేశంగా ఇటలీ నిలిచింది. ఈ క్రమంలో యాప్ స్టోర్‌ల నుంచి ఈ చైనీస్ AI ని తొలగించారు.


ప్రభుత్వ రంగ సంస్థలలో

తైవాన్ కూడా తన పౌరులు చైనీస్ AI చాట్‌బాట్‌ను ఉపయోగించడాన్ని నిషేధించి, కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో డీప్‌సీక్ AIని ఉపయోగించకుండా నిషేధించారు.

ఆస్ట్రేలియా కూడా దేశంలోని అన్ని ప్రభుత్వ పరికరాల నుంచి డీప్‌సీక్ AIని నిషేధించింది. ముప్పు, ప్రమాద విశ్లేషణను పరిశీలించిన తర్వాత, డీప్‌సీక్ ఉత్పత్తులు, అప్లికేషన్‌లు, వెబ్ సేవలను వాడకూడదని చెప్పింది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో DeepSeek వాడకం నేవీ వంటి ప్రభుత్వ విభాగాల్లో పరోక్షంగా నిషేధించబడింది. టెక్సాస్ చైనీస్ AIని, డేటా హార్వెస్టింగ్ వంటి సమస్యలు తీసుకొస్తున్నట్లు భావించి నిషేధించింది.


ఇవి కూడా చదవండి:

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..


ChatGPT: వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ నుంచి వీడియో ఇంటరాక్షన్ ఫీచర్‌

Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

For More Technology News and Telugu News

Updated Date - Feb 06 , 2025 | 02:51 PM