Yashasvi Jaiswal Key Decision: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:38 AM
టీమిండియా టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత్ తరఫున ఆడేందుకు ఎలాంటి మ్యాచులు లేకపోవడంతో దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.
క్రీడా వార్తలు: టీమిండియా టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత్ తరఫున ఆడేందుకు ఎలాంటి మ్యాచులు లేకపోవడంతో దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు రెడీ ఉన్నట్లు.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.
కొద్ది కాలం క్రితం తన హోం జ్టటు ముంబైని కాదని గోవాకు ఆడాలని జైస్వాల్(Yashasvi Jaiswal) నిర్ణయించుకున్నాడు. అయితే తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈక్రమంలో తాజాగా రాజస్థాన్‌తో జరగబోయే మూడో రౌండ్ మ్యాచ్‌కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు జైస్వాల్ ప్రకటించాడు. అయితే తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్‌కు ముంబై(Mumbai cricket team)మేనేజ్మెంట్ అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో జైస్వాల్ పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు అతను సెలెక్ట్ కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్, ముంబై(Rajasthan vs Mumbai) మధ్య మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్‌లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. మరోవైపు భారత్ జట్టు తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచులు ఆడాలని బీసీసీఐ(BCCI rules) నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఇదే సమయంలో మూడో రౌండ్‌కు ముంబై జట్టును త్వరలో ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్లో ఎస్ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!