Yashasvi Jaiswal: చివరి వన్డేలో శతకం తర్వాత జైస్వాల్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Dec 07 , 2025 | 02:48 PM
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ చేశాడు. దీంతో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ తరువాత జైస్వాల్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సూపర్ సెంచరీ(116) చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్ గా వచ్చి.. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-1తో వన్డే సిరీస్(ODI Series) ను కైవసంచేసుకుంది. ఇది ఇలా ఉంటే సూపర్ సెంచరీ తర్వాత జైస్వాల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
తన దేశవాళీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(Syed Mushtaq Ali) 2025లో ఆడాలని జైస్వాల్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. జైస్వాల్ SMATలో చివరిగా 2023-24 ఎడిషన్‌లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్‌ల్లో 136.42 స్ట్రైక్‌రేట్‌తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం గమన్హారం. డిసెంబర్9 నుంచి సౌతాఫ్రికా(South Africa)తో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కలేదు. జైస్వాల్‌కు గత కొంతకాలంగా అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఈ ఈ టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై మాత్రం అధికారిక సమాచారం లేదు. SMAT 2025లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో ఉన్న ముంబై(Mumbai Cricket) ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా కొనసాగుతుంది. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!