Smriti Mandhana: పెళ్లి క్యాన్సిల్.. అధికారికంగా ప్రకటించిన స్మృతి
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:46 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయింది. ఈ మేరకు ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అందరినీ రిక్వెస్ట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దు అయింది. ఆదివారం ఆమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా నవంబర్ 23న స్మృతి- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. అకస్మాత్తుగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురి కావడం.. ఆ మరుసటి రోజే పలాశ్ కూడా అస్వస్థతకు గురి కావడంతో పెళ్లిని వాయిదా వేశారు.

ఆ తర్వాత పలాశ్ వేరే అమ్మాయితో స్మృతి గురించి చేసిన చాట్‌లు వైరల్ అయ్యాయి. ఎంగేజ్‌మెంట్, పెళ్లికి సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో పెళ్లి రద్దు అనే వార్తలకు బలం చేకూరింది. స్మృతి స్నేహితురాళ్లు శ్రేయాంక, జెమీమా కూడా వేడుకలకు సంబంధించి వీడియోలు తొలగించారు. తాజాగా చాలా రోజులుగా జరుగుతోన్న ప్రచారంపై స్మృతి స్పందించింది.
‘గత కొన్ని వారాలుగా నా(Smriti Mandhana) జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. కానీ ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. నా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నా. పలాశ్‌ను నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఈ విషయం ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే చేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలను గెలవడమే నా ముఖ్య లక్ష్యం’ అని ఇన్‌స్టాలో స్మృతి పోస్ట్ పెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్
రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!