Share News

Virat Kohli Retirement: విరాట్ రిటైర్మెంట్‌పై ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ సెటైర్

ABN , Publish Date - May 11 , 2025 | 05:38 PM

ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక విరాట్ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటే తామేమీ తప్పుబట్టమంటూ ఇంగ్లండ్ దేశవాళీ ఛాంపియన్ షిప్ చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Virat Kohli Retirement: విరాట్ రిటైర్మెంట్‌పై ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ సెటైర్
County Championship dig at Kohli,

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటాడా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఈ అంశంపైనే ఉంది. ఇక త్వరలో ఇంగ్లండ్‌-భారత్ టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అక్కడి దేశవాళీ టోర్నీ ‘కౌంటీ ఛాంపియన్‌షిప్’ విరాట్‌పై సెటైర్ పేలుస్తూ నెట్టింట ఓ పోస్టు పెట్టింది. ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

కోహ్లీపై సెటైర్‌ పేలుస్తూ కౌంటీ చాంపియన్‌షిప్ ఈ పోస్టు పెట్టింది. ఓ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా వికెట్లు తీసుకున్న వీడియోను కూడా షేర్ చేసింది. ‘‘నీన్నేమీ తప్పుపట్టము విరాట్’’ అని కామెంట్ చేసింది. అంటే.. ఇంగ్లండ్ క్రికెట్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక రిటైర్ అయ్యేందుకు నిర్ణయం తీసుకుంటే అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదన్నట్టు ఈ కామెంట్ చేసింది. దీనిపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.


ఇంగ్లండ్‌పై కోహ్లీ ఫామ్ లేమితో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 17 మ్యాచ్‌ల్లోని 33 ఇన్నింగ్స్‌లో కోహ్లీ సగటు 33.21 పరుగులు. రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలు చేశాడు. 2018లో ఇంగ్లండ్ టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కోహ్లీ నిలిచాడు. అది మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదనే చెప్పాలి.

ఇక 2020 నుంచి కోహ్లీ ఫామ్ లేమితో సతమతమవుతూనే ఉన్నాడు. ఆ తరువాత జరిగిన 39 మ్యాచుల్లో కోహ్లీ సగటు 30.72గానే ఉంది. కేవలం మూడు శతకాలు, తొమ్మిది అర్థశతకాలు మాత్రమే చేయగలిగాడు. ఇక 2024 నుంచి 11 మ్యాచుల్లో మొత్తం 440 పరుగులు చేశాడు. 23.15 పరుగుల సగటుతో ఒక సెంచరీ, మరో అర్థసెంచరీ మాత్రమే చేయగలిగాడు.


చాలా కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో 2019లో 54.19గా ఉన్న అతడి సగటు పరుగులు 45.85కి పడిపోయాయి. అయితే, ఛేజింగ్‌లో అనేక సందర్భాల్లో కోహ్లీ తనకు సాటి రాగలవాడు లేడని నిరూపించాడు. టీమిండియాకు కీలకంగా నిలిచాడు. దీంతో, కోహ్లీ రిటైర్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. రిటైర్‌మెంట్‌పై తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఇప్పటికే కోహ్లీని బీసీసీఐ అధికారి ఒకరు కోరినట్టు తెలిసింది. దీంతో, కోహ్లీ తుది నిర్ణయం ఏమై ఉంటుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

పాక్ గాలి తీసిన చాహల్

మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌

టెస్ట్‌ జట్టు సారథిగా గిల్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 05:41 PM