Share News

Virat Kohli: లక్నోపై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..ఏకైక ఆటగాడిగా..

ABN , Publish Date - May 28 , 2025 | 08:17 AM

2025 ఐపీఎల్ సీజన్‌లో మే 27న విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డ్ సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. కేవలం 24 పరుగులు అవసరమైన దశలో మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, ఆ టార్గెట్‌ను చేరుకుని, టీ20ల చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Virat Kohli: లక్నోపై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..ఏకైక ఆటగాడిగా..
Virat Kohli 9000 runs

ఐపీఎల్ 2025లో మే 27న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డ్ చేరుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)పై మ్యాచ్‌లో కేవలం 24 పరుగులు అవసరమైన కోహ్లీ, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుతూ టీ20ల్లో ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో కోహ్లీ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ టీ20లతో కలిపి RCB తరపున ఆయన 9003 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచారు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్ – 6060), జేమ్స్ విన్స్ (హాంప్షైర్ – 5934), సురేశ్ రైనా (సీఎస్‌కే – 5529), ఎంఎస్ ధోని (సీఎస్‌కే – 5314) ఉన్నారు.


కోహ్లీ ఆరంభం

లక్నో టీమ్ పెట్టిన భారీ స్కోరు 227/3 ను ఛేదించేందుకు దిగిన RCBకి, కోహ్లీ ఆరంభంలోనే దుమ్ము రేపారు. కేవలం ఐదో ఓవర్‌లోనే 24 పరుగులు పూర్తి చేసి 9000 పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో విరాట్ బ్యాటింగ్ స్టైల్, శాట్స్ చూశాక అభిమానులు మంత్రముగ్దులయ్యారు. కోహ్లీ ఇంతవరకు ఐపీఎల్‌లో 7500 పైగా పరుగులు చేసి అగ్రగామిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్సీబీ తరపున 9000 పరుగులు చేయడం ద్వారా మరో మైలురాయి చేరుకున్నారు.


పంత్ సునామీతో లక్నో భారీ స్కోరు

నిన్నటి మ్యాచులో ఆర్సీబీ బౌలర్లపై లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ పరుగుల దాడి చేశారు. 2018 తర్వాత ఐపీఎల్‌లో ఇది ఆయనకు తొలి సెంచరీ. కేవలం 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన పంత్, మొత్తంగా 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. పంత్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా 37 బంతుల్లో 67 పరుగులు చేసి మంచి సపోర్ట్ అందించాడు. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే పంత్ అద్భుత ప్రదర్శనతో లక్నో 227 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆర్సీబీ తరపున జితేశ్ శర్మ కెప్టెన్సీ చేపట్టగా, చేతికి గాయం కారణంగా రాజత్ పటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.


ఇరు జట్ల వివరాలు

ఆర్సీబీ జట్టులో ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రాజత్ పటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ (కె/వికెట్), రోమారియో షెఫర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారా కలరు.

లక్నో జట్టులో మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రెట్జ్కే, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (కె/వికెట్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాథీ, అవేశ్ ఖాన్, విలియం ఓరోర్క్ ఉన్నారు.


ఇవీ చదవండి:

చారిత్రాత్మక ఛేజ్ నమోదు చేసిన బెంగళూరు..

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 08:53 AM