Share News

SAF Athletics: శాఫ్‌ క్రీడలకు వెంకట్రామ్‌ మోహిత్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 02:43 AM

దక్షిణాసియా అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) పోటీల్లో తెలుగు క్రీడాకారులు వెంకట్రామ్‌ రెడ్డి (కర్నూలు), మోహిత్‌ చౌధురి (నాగర్‌కర్నూల్‌) భారత్‌ తరఫున...

SAF Athletics: శాఫ్‌ క్రీడలకు వెంకట్రామ్‌ మోహిత్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దక్షిణాసియా అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) పోటీల్లో తెలుగు క్రీడాకారులు వెంకట్రామ్‌ రెడ్డి (కర్నూలు), మోహిత్‌ చౌధురి (నాగర్‌కర్నూల్‌) భారత్‌ తరఫున బరిలోకి దిగుతున్నారు. గురువారం నుంచి రాంచీలో మూడ్రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు పోటీ పడనున్నాయి. పురుషుల 800 మీటర్ల పరుగులో వెంకట్రామ్‌, 5 వేల మీటర్ల పరుగు పోటీకి మోహిత్‌ అర్హత సాధించారు. ఇక, బహ్రెయిన్‌లో బుధవారం నుంచి జరిగే ఆసియా యూత్‌ గేమ్స్‌లో యశ్విత (శ్రీకాకుళం) హైజం్‌పలో భారత్‌ తరఫున పోటీ పడనుంది.

ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 02:43 AM