IND VS NZ: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:26 PM
మహిళా ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం న్యూజిలాండ్ తో కీలక సమరానికి భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది.
క్రికెట్ న్యూస్: మహిళా ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం న్యూజిలాండ్ తో కీలక సమరానికి భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. పిచ్ కండిషన్ నేపథ్యంలో తొలుత బౌలింగ్ తీసుకున్నామని కివీస్ కెప్టెన్ సూఫీ డివైన్ తెలిపింది. కాసేపట్లో డ్యూ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాక ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ రేసులో నిలవాలని భావిస్తున్నట్లు కివీస్ కెప్టెన్ పేర్కొంది.
మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) తెలిపింది. తాము ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పింది. పిచ్ చాలా బాగుందని, ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి అవకాశంగా భావిస్తున్నామని ఆమె తెలిపింది. గత మూడు మ్యాచుల్లో తాము చివరి నిమిషంలో గెలుపు అవకాశాలను చేజార్చుకున్నామని, ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంటామని ఆమె చెప్పుకొచ్చింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్((Harmanpreet Kaur)) జట్టు సెమీస్ కు చేరాలంటే..ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే.. సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారుతాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా(South Africa), ఇంగ్లాండ్ చేతుల్లో భారత్ వరుస ఓటములు చవిచూసింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మ్యాచుల్లో గెలిస్తేనే సెమీస్ కు చేరుతుంది. లేకుంటే.. వరల్డ్ కప్( Women's World Cup 2025) ఆశలు అడియాసలుగానే మిగులుతాయి.
తుది జట్లు
ఇండియా: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
న్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (కెప్టెన్), బ్రూక్ హల్లిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ గేజ్ (వికెట్ కీపర్), జెస్ కెర్, రోస్‌మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సెన్
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..