Share News

Tungabhadra Warriors: తుదిపోరుకు తుంగభద్ర

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:57 AM

రోహిత్‌ 87, డీబీ ప్రశాంత్‌ 64 నాటౌట్‌ అర్ధ శతకాలతో అదరగొట్టడంతో తుంగభద్ర వారియర్స్‌ జట్టు ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది...

Tungabhadra Warriors: తుదిపోరుకు తుంగభద్ర

విశాఖపట్నం-స్పోర్ట్సు (ఆంధ్రజ్యోతి): రోహిత్‌ (87), డీబీ ప్రశాంత్‌ (64 నాటౌట్‌) అర్ధ శతకాలతో అదరగొట్టడంతో తుంగభద్ర వారియర్స్‌ జట్టు ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో తుంగభద్ర ఐదు వికెట్ల తేడాతో భీమవరం బుల్స్‌పై గెలుపొందింది. తొలుత భీమవరం నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 183 పరుగులు చేసింది. సాయి శ్రవణ్‌ (71 నాటౌట్‌)తో రాణించాడు. వారియర్స్‌ బౌలర్‌ దీపక్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వారియర్స్‌ 19 ఓవర్లలో ఐదు వికెట్లకు 188 పరుగులు చేసి ఫైనల్లోకి ప్రవేశించింది. బుల్స్‌ బౌలర్లలో హరిశంకరరెడ్డి, సత్యనారాయణరాజు చెరో రెండు వికెట్లు తీశారు. శనివారం జరిగే ఫైనల్లో అమరావతి రాయల్స్‌తో తుంగభద్ర వారియర్స్‌ తలపడనుంది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 03:57 AM