Ind Vs Pak: భారత్ వర్సెస్ పాక్.. ఇరు దేశాల్లోని టాప్ స్కోరర్లు వీరే!
ABN , Publish Date - Feb 23 , 2025 | 02:25 PM
భారత్ పాక్ మ్యాచుల్లో అత్యధిక స్కోర్లు వికెట్లు తీసిన క్రీడాకారులు ఎవరంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటివరకూ జరిగిన భారత్, పాక్ మ్యాచులను పరిశీలిస్తే వన్డేల్లో పాక్, భారత్‌పై పైచేయి సాధించింది. కానీ ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రం వెనకబడింది. వివిధ ఐసీసీ ఈవెంట్స్ ఆడిన 21 మ్యాచుల్లో పాక్ నాలుగు సార్లే గెలవగా ఇందులో మూడు విజయాలు ఛాంపియన్స్ ట్రోఫీలోనే దాయాది దేశానికి దక్కాయి. ఇక చివరిసారిగా పాక్, బారత్‌లో దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఈవెంట్ 2021 టీ20 వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఇందులో పాక్ విజయం సాధించింది. దీంతో, పాక్‌లో విజయంపై ఆశ ఎంతోకొంత మిగిలే ఉంది. గెలుపు ఎవరిదన్న అంచనాలు ఇప్పటికే వెలువడిన నేపథ్యంలో అసలు ఈ మ్యాచుల్లో అత్యధిక స్కోర్లు చేసిన వారెవరో తెలుసుకుందాం.
Shaheen Afridi: ఆ టీ20 ఫలితం రిపీట్ కాకుండా రోహిత్, విరాట్ వ్యూహాలు!
భారత్ వర్సెస్ పాక్ వన్డేల్లో అత్యధిక స్కోర్లు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ తొలిస్థానంలో ఉన్నారు. పాక్‌తో 69 వన్డే మ్యాచులు ఆడిన సచిన్ ఐదు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలతో మొత్తం 2526 పరుగులు చేశాడు. 47 ఇన్నింగ్స్‌లో 29 వికెట్లు కూడా తీశాడు.
మాజీ పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ భారత్‌తో ఆడిన 50 వన్డేల్లో 2002 పరుగుల చేశాడు. అన్వర్ బ్యాటింగ్ యావరేజ్ 43.52 పరుగులు. భారత్ పాక్ మ్యాచుల్లో అత్యధిక వ్యతిగత స్కోరు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1997లో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 146 బంతుల్లో 194 పరుగులు స్కోర్ చేశాడు.
Champions Trophy: Ind Vs Pak: గిల్‌ని టార్గెట్ చేయండి.. పాక్‌కు మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రజా సూచన
ఇక పాక్‌తో 53 వన్డేలు ఆడిన సౌరవ్ గంగూలీ మొత్తం 1652 పరుగులు చేశాడు. దయాది దేశంపై బౌలింగ్‌లో కూడా ఇతర భారతీయ బౌలర్ల కంటే గంగూలీ ముందే ఉన్నాడు. టొరొంటోలో 1997లో జరిగిన ఓ మ్యాచ్‌లో గంగూలీ కేవలం 16 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీశాడు.
భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాళ్లల్లో ఇన్‌జమామ్ ఉల్ హక్ ముందు వరుసలో ఉన్నాడు. 1992 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీంలో ముఖ్య భాగస్వామిగా ఉన్న ఇన్‌జీ భారత్‌పై ఆడిన 67 మ్యాచుల్లో నాలుగు సెంచరీలు, 12 అర్ధశతకాలతో మొత్తం 2403 పరుగులు చేశాడు. అతడి నాయకత్వంలో పాక్ భారత్‌పై ఆడిన 22 వన్డేల్లో 12 విజయాలు సాధించింది.
Babar Azam: స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం లొల్లి.. పాక్ సతమతం
పాక్‌పై పలు మ్యాచులు ఆడిన ధోనీ మొత్తం 1231 పరుగులు చేశాడు. అతడి సారథ్యంలో టీమిండియా పాక్‌ను రెండు వన్డే వరల్డ్ కప్, ఐడు టీ20 కప్‌లలో చిత్తుగా ఓడించింది. ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పైచేయి సాధించింది.
పాక్ లెజెండరీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీదీ భారత్‌పై ఆడిన 67 వన్డేల్లో 1524 పరుగులు చేసి 38 వికెట్లు తీశాడు. అనేక మ్యాచుల్లో ఒంటి చేత్తో తన టీంను విజయతీరాలకు చేర్చాడు. ఇక భారతీయ అత్యుత్తర ఆల్ రౌండరు కపిల్ దేవ్ పాక్‌పై ఆడిన 32 వన్డేల్లో 382 పరుగులు చేసి 42 వికెట్లు తీశారు. మరో పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మొత్తం 29 వన్డేల్లో 433 పరుగులు, 35 వికెట్లు తీశారు. ఇక పాక్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ భారత్‌పై ఆడిన 60 మ్యాచుల్లో 48 వికోట్లు తీశారు. అంతేకాకుండా, 425 పరుగులు చేశారు. పాక్‌తో 34 మ్యాచులు ఆడిన అనీల్ కుంబ్లే 54 వికెట్లు తీశాడు. 22 ఇన్నింగ్స్ ఆడి 160 పరుగులు స్కోర్ చేశాడు. ఇక రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయెబ్ అఖ్తర్ భారత్‌పై ఆడిన 27 వన్డేల్లో 41 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..