Share News

Champions Trophy: Ind Vs Pak: గిల్‌ని టార్గెట్ చేయండి.. మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రజా సూచన

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:48 PM

శుభ్‌మన్ గిల్‌ను త్వరగా ఔట్ చేస్తే పాక్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతాయని పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రజా అన్నారు. భారత్‌ టాప్ ఆర్డర్‌లోని భయం తమకు అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు.

Champions Trophy: Ind Vs Pak: గిల్‌ని టార్గెట్ చేయండి.. మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రజా సూచన

ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని గంటల్లో భారత్, పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్‌దే గెలుపని విశ్లేషకులు అందరూ అంచనాకు వచ్చారు. అయితే, పాక్ ప్లేయర్లు మాత్రం చివరి వరకూ పోరాడుతామని ఘంటాపథంగా చెబుతున్నారు. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. బలంగా ఉన్న బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పాక్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వేళ దయాదీ దేశం క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా కీలక సూచన చేశారు. అంచనా లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా తమకు అనుకూలంగా మారొచ్చన్న ఆయన గిల్‌ను టార్గెట్ చేయాలని పాక్ ప్లేయర్లకు సూచించారు (Champions Trophy 2025).


Babar Azam: స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం లొల్లి.. పాక్ సతమతం

భారత్‌ టాప్ ఆర్డర్‌లో బలహీనతలు, బౌలింగ్‌లో జరిగిన మార్పులు తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని రమీజ్ రజా అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌ ఖాతాలో ఇప్పటికే ఓ విజయం ఉంది. తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించారు. మరోవైపు పాక్ విజయం కోసం తపిస్తోంది. పెద్దగా అంచనాలేవీ లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే, ఇది అంతిమంగా పాక్‌కు లాభించొచ్చు. ఇది పాక్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం కల్పించింది’’ అని అన్నారు. తమ తొలి గేమ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తరువాత పాక్‌కు భారత్‌పై గెలుపు అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. ఓడిన పక్షంలో పాక్ ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి రావచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం పాక్‌కు కలిసొస్తుందని అన్నారు. ఈ సమయంలో గిల్‌ను త్వరగా అవుట్ చేయగలిగితే విజయం పాక్‌ను వరిస్తుందని చెప్పాడు.


Champions Trophy: భారత్‌తో మ్యాచ్.. పాక్ గెలవాలంటే ఇదొక్కటే మార్గం

స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ సింగిల్స్ స్కోర్ చేయడంలో భారత్ తడబడుతోందని రమీజ్ రజా అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 145 బంతులకు పరుగులేవీ రాక వృథాగామారిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘టాప్ ఆర్డర్ క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. రిస్క్ తీసుకునేందుకు జంకుతుంది. ఔటవుతామన్న భయంలో ఉంటుంది. ఈ భయమే వారిని భారీ లక్ష్యాలు ఏర్పాటు చేసేందుకు, ఛేదనలో దూసుకుపోయేందుకు అడ్డంకిగా మారుతోంది’’ అని అన్నాడు. పాక్ బౌలర్లపై కూడా రజా విమర్శలు గుప్పించారు. ఒత్తిడిని నిలదొక్కుకోవడం, యార్కర్లు, స్లో బౌన్సర్లు, ఇతర రకాల బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థులను తికమకపెట్టే పదునైన వ్యూహం పాక్ బౌలర్లలో కొరవడిందని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 01:11 PM