Share News

Babar Azam: స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం లొల్లి.. పాక్ సతమతం

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:11 PM

మరి కొన్ని గంటల్లో భారత్, పాక్ క్రికెట్ టీమ్‌లు తలపడనుండగా దయాది దేశం స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అన్న అంశం అక్కడి అభిమానులను వేధిస్తోంది.

Babar Azam: స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం లొల్లి.. పాక్ సతమతం

ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా నేడు భారత్‌తో జరిగే మ్యాచ్ పాక్‌కు అత్యంత కీలకం. ఇంతటి ముఖ్యమైన మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం కానకాకపోవడం దయాది దేశం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. అతడు లేకుండా బరిలోకి దిగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ మొదలు కానున్న ఈ విషయంపై అభిమానుల్లో స్పష్టత లేదు. ఈ మ్యాచ్‌లో అతడు బరిలో నిలవక పోవచ్చన్న వాదన బలపడింది. శనివారం సాయంత్రం పాక్ టీం ప్రాక్టీస్ సెషన్‌లో బాబర్ ఆజం మినహా మిగతా ఆటగాళ్లు అందరూ హాజరయ్యారు. స్వయంగా పీసీబీ చీఫ్ నఖ్వీ హాజరైన ఈ సెషన్‌కు ఆజం మాత్రం దూరంగానే ఉన్నాడు (Babar Azam).


Champions Trophy: భారత్‌తో మ్యాచ్.. పాక్ గెలవాలంటే ఇదొక్కటే మార్గం

న్యూజిలాండ్‌తో పోరులో పాక్ ఓటమి ఓటమి తరువాత బాబర్ తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. 320 పరుగుల లక్ష్య ఛేదనకు అవసరమైన స్థాయిలో రన్ రేట్ పెంచడంలో విఫలమైనందుకు అభిమానులు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ప్రాక్టీస్ సెషన్‌కు బాబర్ ఆజం దూరమయ్యాడు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాక్ కోచ్ అకీబ్ జావేద్ ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. బాబర్ ఆజం ఎందుకు రాలేదో కారణం చెప్పనేలేదు.


Ind vs Pak: పాపం పాకిస్తాన్ అభిమానులు.. ఈసారి మ్యాచ్ ఓడిపోయినా టీవీలు పగలగొట్టలేరు..

ఆ తరువాత పీసీబీ చీఫ్ నఖ్వీ పాక్ ప్లేయర్లందరితో సమావేశమయ్యారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో పాక్ ఎలాగైన గెలవాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో పాక్ ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాల్సి వస్తుందని హెచ్చరించారు. విమర్శకుల నోళ్లకు తాళం వేసేందుకు ఇదొక్కటే మార్గం అని అన్నారు. పీసీబీ చీఫ్ సమావేశం కారణంగా టీం ప్రాక్టీస్ సెషన్‌లో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక నఖ్వీ పాక్ కెప్టెన్ రిజ్వాన్‌తో పాటు హెడ్ కోచ్‌ అకీబ్ జావేద్‌తో కూడా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ మ్యాచ్‌కు ప్లేయర్ల ఎంపికపై నఖ్వీ అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ప్రతి ఒక్క ప్లేయర్‌ను వ్యక్తిగతంగా కలిసి గెలుపు ఆవశ్యకతను వివరించినట్టు సమాచారం. పాక్ పేసర్లు షాహీన్ షా, హారిస్ రవూఫ్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారట.

ఆ తరువాత విలేకరులతో మాట్లాడిన నఖ్వీ... భారత్‌తో తలపడేందుకు పాక్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. మంచి ఆటతీరు కనబరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, నేటి మ్యాచ్‌లో ఎం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 12:11 PM