Shaheen Afridi: ఆ టీ20 ఫలితం రిపీట్ కాకుండా రోహిత్, విరాట్ వ్యూహాలు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:35 PM
2021 నాటి వరల్డ్ కప్ టీ20 టోర్నీలో భారత్ ప్లేయర్లను పాక్ పేసర్ షాహీన్ అఫ్రీదీ చుక్కలు చూపించాడు. అతడిని మరోసారి ఎదుర్కోనున్న విరాట్, రోహిత్ తమదైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ వేదికగా భారత్, పాక్ చివరిసారిగా తలపడిన ఐసీసీ టోర్నమెంట్‌లో పాక్ టీమిండియాకు గట్టి షాకే ఇచ్చింది. 2021 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ ఓడించిన చరిత్ర సృష్టించింది. నాటికి నేటి మధ్య పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఆ తరువాత జరిగిన మూడు వరల్డ్ కప్ మ్యాచుల్లో భారత్ పాక్‌ను మట్టికరిపించింది. కానీ యూఏఈ వేదికగా దయాది దేశాలు తలపడుతున్నాయంటే భారతీయ అభిమానుల్లో గుబులు మొదలవుతుంది (Champion Trophy Ind Vs Pak).
Champions Trophy: Ind Vs Pak: గిల్‌ని టార్గెట్ చేయండి.. పాక్‌కు మాజీ పీసీబీ చీఫ్ రమీజ్ రజా సూచన
నాలుగేళ్ల నాటి ఆ మ్యాచ్‌లో పాక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షాహీన్ అఫ్రీదీ రోహిత్, విరాట్‌కు చుక్కలు చూపించాడు. అప్పట్లో రోహిత్‌కు డకౌట్ చేసిన షాహీన్, కేఎల్ రాహుల్‌ను ఒక పరుగు స్కోరుకే పెవిలియన్ బాట పట్టించాడు. సెంచరీ చేద్దామనుకున్న విరాట్ ఆశలు వమ్ము చేస్తూ 57 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఇక 2023 ఆసియా కప్‌లో కూడా షాహీన్ 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత్ బ్యాటర్‌లపై అతడి ఆధిపత్యం జనాలకు ఇప్పటికీ గుర్తుంది.
Babar Azam: స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం లొల్లి.. పాక్ సతమతం
ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా భారత స్టార్ బ్యాటర్లు రోహిత్, విరాట్ తమ వ్యూహాలతో సిద్ధమయ్యారు. ముఖ్యంగా పాక్ కనెక్షన్ ఉన్న మరో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అవైసీ అహ్మద్ బంతులను ఎదుర్కొని నేటి మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. ‘‘ట్రెయినింగ్‌లో విరాట్‌కు, రోహిత్‌కు సాయం పడే అవకాశం లభించడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నాదీ పాక్ బౌలర్ సనీమ్ షాది ఒకటే జిల్లా. నేను ఇన్‌స్వింగర్లు, ఔట్ స్వింగర్లు బౌల్ చేయగలను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, 2021 నాటి ఫలితం రిపీట్ అయ్యే అవకాశం తక్కువనేది నిపుణులు చెప్పే మాట. నాటి మ్యాచ్ తరువాత భారత్ పాక్ ఐదు సార్లు తలపడగా భారత్ ఏకంగా నాలుగు సార్లు నెగ్గింది. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినప్పటికీ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌ను 3-0తో చిత్తు చేసి తమ ఫామ్‌ను నిరూపించుకుంది. అయితే, ఆ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన పాక్‌ను తక్కువ అంచనా వేయకూడదనేది నిపుణులు చెప్పేమాట.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..