IndiaW vs PakistanW : పాకిస్తాన్‌కు సవాల్..టార్గెట్ స్కోర్ చేరుకునేందుకు కష్టాలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:02 PM
కొలంబో వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో ఆరో మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 247 రన్స్ చేసింది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రం ఈ స్కోర్ బీట్ చేసేందుకు తెగ కష్టపడుతోంది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరుగుతున్న ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 247 పరుగులు సాధించి, పాక్ ముందు 248 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత మహిళల జట్టు చివరకు సమర్థంగా బ్యాటింగ్ చేసి, పాకిస్తాన్‌కు మంచి సవాల్ స్కోరును అందించింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు పాకిస్తాన్ కష్టపడుతూనే ఉంది. ప్రస్తుతం పాక్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
దీంతో పాకిస్తాన్ జట్టు కష్టాల్లో పడింది. ఈ స్కోర్ ప్రకారం చూస్తే పాకిస్తాన్ జట్టు గెలవడం చాలా కష్టమని చెప్పవచ్చు. భారత్‌పై వన్డేల్లో వరుసగా 11 ఓటముల సిరీస్‌ను బ్రేక్ చేయాలంటే పాకిస్తాన్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలి. కానీ చివరకు ఏ జరుగుతుందో చూడాలి మరి.
పాకిస్తాన్ మహిళల జట్టులో: మునీబా అలీ, ఒమైమా సొహైల్, సిద్రా అమీన్, రమీన్ షమీమ్, ఆలియా రియాజ్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), ఫాతిమా సనా (కెప్టెన్), నటాలియా పర్వైజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, షవాల్ జుల్ఫికర్, ఎయ్మన్ ఫాతిమా, సయీదా అరూబ్ షా, సదాఫ్ షమాస్.
భారత్ మహిళల జట్టులో: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ఉమా చెట్రి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి