Tilak Varma: కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:25 PM
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును టీమిండియా స్టార్ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మ నడిపించనున్నాడు. ఢిల్లీతో ఈనెల15 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును టీమిండియా స్టార్ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మ నడిపించనున్నాడు. ఢిల్లీతో ఈనెల15 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవలే ఆసియా కప్ లో అదరగొట్టిన తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించింది. అతనికి రాహుల్ సింగ్ వైస్ కెప్టెన్ వ్యవహరించనున్నాడు.
ఈ రంజీ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో రంజీ ట్రోఫీకి సిరాజ్ దూరంగా ఉన్నాడు. ఇక హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే.. సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమ తేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ ఎంపికయ్యారు. నితీష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షన్ రెడ్డి, నితీష్ కనాలా, మిఖిల్ జైస్వాల్ స్టాండ్ బైలుగా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో అతను రెండో రంజీ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ విజయం గంభీర్ ది కాదు: రోహిత్
టెస్టు ర్యాంకింగ్స్.. సిరాజ్, జడేజాకు అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..