Share News

ICC Womens ODI World Cup 2025: పాకిస్తాన్ టార్గెట్ ఏంతంటే.. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ పోరు

ABN , Publish Date - Oct 05 , 2025 | 07:23 PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, భారత్‌ను 50 ఓవర్లలో 247 పరుగులకు కట్టడి చేసింది.

ICC Womens ODI World Cup 2025: పాకిస్తాన్ టార్గెట్ ఏంతంటే.. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ పోరు
ICC Womens ODI World Cup 2025

ఐసీసీ మహిళల వన్డే 2025 ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ మొదట బ్యాటింగ్‌కి దిగగా, ఓపెనర్లు మంచి ప్రారంభం ఇచ్చినా, పాకిస్తాన్ బౌలర్లు కఠినంగా బౌలింగ్ చేసి భారత ఆటగాళ్లను కట్టడి చేశారు. ఈ క్రమంలో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.

స్మృతి మంధాన 32 బంతుల్లో 23, ప్రతిక రావల్ 31, హర్లీన్ డియోల్ 46 (అత్యధికంగా), జెమిమా రోడ్రిగ్స్ 32, దీప్తి శర్మ 25, హర్మన్‌ప్రీత్ కౌర్ 19, స్నేహ్ రాణా 20, రిచా ఘోష్ 35 (నాటౌట్) స్కోర్ చేశారు. పాకిస్తాన్ బౌలర్లు సాదియా ఇక్బాల్ (4/72), డయానా బైగ్ (4/69), ఫాతిమా సనా (3/82), రమీన్ షమీమ్ (3/39), నష్రా సంధు (1/52) వికెట్లు తీశారు. భారత్ మొదట్లో వికెట్లు కోల్పోయినా చివరకు మంచి టార్గెట్ స్కోర్ సాధించింది.


రికార్డ్ స్కోర్

ఈ మ్యాచులో ఒక్కరు కూడా 50కిపైగా రన్స్ చేయలేదు. అయితే మహిళల ODIలో వ్యక్తిగత స్కోరు 50+ లేకుండా అత్యధిక స్కోర్ ఉన్న వాటిలో ప్రస్తుత మ్యాచ్ ఇండియా స్కోర్ టాప్ 4లో నిలిచింది.

  • 267/9 - న్యూజిలాండ్-మహిళలు vs ఇంగ్లాండ్-మహిళలు, చెన్నై (వేలచ్చేరి), 2007

  • 266/5 - ఆస్ట్రేలియా-మహిళలు vs ఇంటర్నేషనల్ XI-మహిళలు, వెల్లింగ్టన్, 1982 WC

  • 259/8 - ఇంగ్లాండ్-మహిళలు vs ఆస్ట్రేలియా-మహిళలు, బ్రిస్టల్, 2017 WC

  • 247 - భారత్-మహిళలు vs పాకిస్తాన్-మహిళలు, కొలంబో RPS, 2025 WC

  • 245/7 - న్యూజిలాండ్-మహిళలు vs నెదర్లాండ్స్-మహిళలు, ఉట్రెచ్ట్, 2002

భారత్ గత అత్యధిక స్కోరు: 227 vs న్యూజిలాండ్-మహిళలు, అహ్మదాబాద్, 2024లో. దీన్ని బట్టి చూస్తే ఇండియా గెలుస్తుందని క్రీడాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


భారత మహిళల జట్టు కూడా మెన్స్ టీమ్ మాదిరిగా షేక్ హ్యాండ్‌ చేయకుండానే ఆటను ప్రారంభించింది. హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సానాతో టాస్ సమయంలో షేక్ హ్యాండ్‌ చేయలేదు. దీంతో కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. వర్షం కారణంగా ఆటకు కొద్ది సేపు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ మొదలైంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 07:50 PM