Share News

Gavaskar warning: రోహిత్, కోహ్లీకి మరో బ్యాడ్ న్యూస్ తప్పదా.. గవాస్కర్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Oct 07 , 2025 | 08:09 AM

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెలలో జరిగే వన్డే సిరీస్ కోసం బరిలోకి దిగబోతున్నారు. 2027 ప్రపంచకప్ వరకు వారు జట్టులో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Gavaskar warning: రోహిత్, కోహ్లీకి మరో బ్యాడ్ న్యూస్ తప్పదా.. గవాస్కర్ ఏమన్నారంటే..
Virat Kohli, Rohit Sharma

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెలలో జరిగే వన్డే సిరీస్ కోసం బరిలోకి దిగబోతున్నారు. 2027 ప్రపంచకప్ వరకు వారు జట్టులో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అయితే భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి సెలక్టర్లు షాకిచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు.


'అప్రమత్తంగా లేకపోతే రోహిత్‌కు మరో బ్యాడ్ న్యూస్ తప్పదు. 2027 వన్డే ప్రపంచ కప్ (2027 World Cup) వరకు భారత జట్టుకు ఎక్కువ వన్డే మ్యాచ్‌లు లేవు. కాబట్టి రోహిత్, కోహ్లీ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో చురుకుగా ఉండాలి. మీరు (రోహిత్, కోహ్లీ) నిబద్ధతతో లేకపోతే, మీరు రాబోయే 2 సంవత్సరాలకు సిద్ధంగా ఉంటారా లేదా అని నిర్ణయించుకోలేకపోతే, బ్యాడ్ న్యూస్ కోసం సిద్ధంగా ఉండండి. మీరు కేవలం వన్డేలు మాత్రమే ఆడితే ప్రాక్టీస్ ఎక్కువ అవసరం అవుతుంది' అని గవాస్కర్ పేర్కొన్నారు.


'ఎవరికైనా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా చాలా తక్కువ వన్డేలు ఆడుతోంది (Gavaskar warning). ఈ నేపథ్యంలో ఫామ్, ఫిట్‌నెస్ కాపాడుకోవడం ఎవరికైనా చాలా కీలకం. ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైన ప్రాక్టీస్ కావాలి. జట్టులో రోహిత్ స్థానం పక్కా కానందువల్లే శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటారు' అని గవాస్కర్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 08:09 AM