Stuart Broad: ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:22 PM
ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ఆస్ట్రేలియా క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ ఓ చెత్త జట్టు అని.. ఇప్పటికీ ఇదే మాట అంటానని వెల్లడించాడు. కాగా యాషెస్ సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్ సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ అత్యంత పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే 0-3తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. 2011 నుంచి సొంతగడ్డపై ‘యాషెస్’ కోల్పోని కంగారూలు.. ఈ సారి కూడా పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌లో వరుసగా నాలుగో సారి సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా సిరీస్ గెలిచాక ఆస్ట్రేలియా ప్లేయర్లు బ్రాడ్‌కు వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించాడు. ‘2010-201 తర్వాత యాషెస్ సిరీస్ ఆడుతున్న అత్యంత చెత్త జట్టు ఆస్ట్రేలియా. ఇదొక ఆప్షన్ కాదు.. ఇదే నిజం. ఆసీస్ ప్లేయర్లు నా పై చేసిన వ్యాఖ్యలకు నేనేమీ బాధ పడటం లేదు. ఆస్ట్రేలియా అత్యంత చెత్తగా ఆడాల్సింది. ఇంగ్లండ్ గొప్ప ప్రదర్శన చేయాల్సింది. అయితే ఆసీస్ మరీ అంత చెత్తగా ఆడలేదు. ఇంగ్లండ్ అంత గొప్పగా ఆడలేదు’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి:
దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. కలల ‘కప్పు’ దరి చేరిన వేళ!
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు!