Smriti Mandhana: పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్.. వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండా!
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:22 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలిసారిగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఆమె వేలికి ఉంగరం లేకపోవడం చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా..స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలవ్వడంతో అనూహ్యంగా వాయిదా పడింది. ఆ మరుసటి రోజే పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. ఇప్పడు ఈ ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు కానీ పెళ్లి తేదీని ఇప్పటికీ ప్రకటించలేదు.
ఈ క్రమంలో పెళ్లి వాయిదా తర్వాత స్మృతి(Smriti Mandhana) ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఓ పెయిడ్ ప్రకటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోలో స్మృతి చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకపోవడం ఆసక్తిగా మారింది. దీంతో ఆ షూట్ నిశ్చితార్థానికి ముందు చేశారా? లేక తర్వాత చేశారా? అనే చర్చ మొదలైంది. పెళ్లి వాయిదా, తండ్రి అనారోగ్యం.. ఇలాంటి కష్ట సమయంలో స్మృతి మళ్లీ యాక్టివ్‌గా కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
పెళ్లి వాయిదా తర్వాత స్మృతి మంధాన తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె స్నేహితురాళ్లు శ్రేయాంక పాటిల్, జెమీమా కూడా వారి అకౌంట్ల నుంచి పోస్టులు తొలగించారు. దీంతో పెళ్లి రద్దు అయిందనే వార్తలు జోరుగా ప్రచారం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలాశ్.. వేరే యువతితో స్మృతి గురించి మాట్లాడిన చాట్ వైరల్ అవ్వడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. దీంతో స్మృతి సోదరుడు, పలాశ్ సోదరి పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కెప్టెన్సీ నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీదే: రియాన్ పరాగ్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్