Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు పక్కన పెట్టారు.. సెలక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి..
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:51 PM
ఆసియా కప్-2025కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. శ్రేయస్ 2025 ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌ల్లో 175 స్ట్రైక్ రేట్‌తో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు.
ఆసియా కప్-2025 (Asia Cup 2025)కు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. శ్రేయస్ 2025 ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌ల్లో 175 స్ట్రైక్ రేట్‌తో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. అంత అద్భుతంగా రాణించినా తాజా ఆసియా కప్ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. ఆసియా కప్ కోసం సెలక్టర్లు ప్రకటించిన మరో ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో కూడా అయ్యర్‌కు చోటు దక్కలేదు.
అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్టర్ల నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. 'తాజాగా ఆసియా కప్ కోసం సెలక్టర్లు చేసిన పని లాజిక్‌కు అందడం లేదు. టెస్ట్ మ్యాచ్‌లో ప్రదర్శనను బట్టి టీ-20లకు ఓ ఆటగాడిని ఎలా ఎంపిక చేస్తారో అర్థం కావడం లేదు. టెస్ట్ మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శనకు టీ-20ల్లో లభించిన బహుమతిగా దీనిని అర్థం చేసుకోవాలా. దీని వెనుకున్న లాజిక్ నాకు అందడం లేదు. చాలా సంవత్సరాలుగా భారత సెలక్టర్లు ఈ విధానాన్నే అవలంభిస్తున్నారు' అని సంజయ్ విమర్శించాడు.
'దేశీయ క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే కారణంతోనే అయ్యర్‌ను తప్పించారు. అందులో న్యాయం ఉంది. అయితే ఆ తర్వాత అయ్యర్ మెరుగయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. అతడి ఫుట్‌వర్క్ మెరుగుపడింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ, ఐపీఎల్‌లోనూ ఆ ఫామ్‌ను కొనసాగించాడు. కొన్ని నెలలుగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఆటగాడిని ఎంపిక చేయకుండా మీరు ఇచ్చే సందేశం ఏమిటి' అని అయ్యర్ ప్రశ్నించాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి