Pro Kabaddi League Season 12: ప్రొ.కబడ్డీ.. మరింత రంజుగా
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:01 AM
మరో వారం రోజుల్లో ప్రొ.కబడ్డీ లీగ్ పీకేఎల్ అభిమానులను అలరించనుంది. అయితే సీజన్ 12లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పోటీలను ఇంకా రసవత్తరంగా మార్చి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేందుకు లీగ్..
టోర్నీలో భారీ మార్పులు
లీగ్ దశలో గోల్డెన్ రైడ్
ముంబై: మరో వారం రోజుల్లో ప్రొ.కబడ్డీ లీగ్ (పీకేఎల్) అభిమానులను అలరించనుంది. అయితే సీజన్-12లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పోటీలను ఇంకా రసవత్తరంగా మార్చి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేందుకు లీగ్ దశను మరింత విస్తరించారు. ప్లేఆ్‌ఫ్సలోనూ మార్పులు చేశారు. ఈ సీజన్‌ను విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈనెల 29న ప్రారంభమయ్యే పీకేఎల్ లీగ్ దశలో మొత్తం 108 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టు 18 మ్యాచ్‌లు ఆడుతుంది. టైబ్రేకర్ విధానాన్ని మరింత విస్తృతం చేయడంతోపాటు లీగ్ దశలో ‘గోల్డెన్ రైడ్’ అమలు చేయనున్నారు. గతంలో గోల్డెన్ రైడ్ ప్లేఆ్‌ఫ్సలో మాత్రమే ఉండేది. ఇకపై లీగ్ దశలో మ్యాచ్ ‘టై’ అయితే ఐదు రైడ్లతో కూడిన షూటౌట్ నిర్వహిస్తారు. ఇందులో ఫలితం తేలకపోతే గోల్డెన్ రైడ్ ఉంటుంది. అప్పటికీ ఫలితం రాకపోతే ‘టాస్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అలాగే పాయింట్ల విధానాన్ని మరింత సరళతరం చేశారు. ఇకపై విజయానికి రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఓటమికి పాయింట్లేమీ ఉండవు. ఇంకా..ప్లేఆ్‌ఫ్సను ప్రక్షాళన చేయడంతోపాటు ‘ప్లేఇన్’ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఫలితంగా..లీగ్ దశలో తొలి ఎనిమిది స్థానాలలో నిలిచిన జట్లకు ప్లేఆ్‌ఫ్సకు క్వాలిఫై అయ్యే అవకాశముంటుంది. కొత్త విధానంలో..లీగ్ దశలో ఐదు నుంచి ఎనిమిది స్థానాలలో నిలిచిన జట్లు ‘ప్లేఇన్’ మ్యాచ్‌ల్లో తలపడతాయి. ప్లే ఇన్ మ్యాచ్‌ల విజేతలు ఎలిమినేటర్స్‌లో అడుగు పెడతాయి. మూడు, నాలుగు స్థానాలు సాధించిన జట్లు ‘మినీ క్వాలిఫయర్’లో ఢీకొంటాయి. మినీ క్వాలిఫయర్‌లో గెలుపొందిన జట్టు ముందడుగు వేస్తుంది. ఇక ఓడిన జట్టుకు ఫ్లేఆఫ్స్ ద్వారా మరో అవకాశం లభిస్తుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1లో తలపడతాయి. క్వాలిఫయర్-1 విజేత నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 ద్వారా మరో చాన్సు లభిస్తుంది. ప్లేఆ్‌ఫ్సలో మూడు ఎలిమినేటర్లు, రెండు క్వాలిఫయర్స్ ఉంటాయి.
విశాఖలో తొలి అంచె..
ఈనెల 29న విశాఖపట్నం అంచెతో లీగ్ మొదలవుతుంది. రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియం లో సెప్టెంబరు 11 వరకు వైజా గ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ తలపడతాయి. విజయ్ మాలిక్ కెప్టెన్సీలో తెలుగు టైటాన్స్ బరిలో దిగుతోంది. శుభమ్ షిండే వైస్-కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి