Hyderabad Spinner Gauhar Sultana: క్రికెట్‌కు గౌహర్ వీడ్కోలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:05 AM
క్రికెట్‌కు హైదరాబాదీ లెఫ్టామ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానా వీడ్కోలు పలికింది. క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రికెట్‌కు హైదరాబాదీ లెఫ్టామ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానా వీడ్కోలు పలికింది. క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 37 ఏళ్ల సుల్తానా 2008లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. 2009, 2013 వన్డే వరల్డ్‌క్‌పల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె, కెరీర్‌లో 50 వన్డేలు, 37 టీ20లు ఆడి మొత్తం 95 వికెట్లు సాధించింది. 2014 తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోయిన సుల్తానా తిరిగి 2024 మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ తరఫున మెరిసింది. ఈ ఏడాది కూడా వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ పోటీలకు కూడా వీడ్కోలు పలికింది. కెరీర్ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, సహచర క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపింది. బీసీసీఐ లెవల్-2 శిక్షణ పూర్తి చేసిన సుల్తానా భవిష్యత్‌లో కోచ్‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి