Shefali Verma Sachin Tendulkar: ఫైనల్‌కు ముందు సచిన్‌తో చాట్: షెఫాలీ వర్మ
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:00 PM
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి.. విశ్వ విజేతగా భారత్ నిలిచింది. ఈ అపూర్వ విజయంలో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది . అనూహ్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షఫాలి వర్మ.. తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది.
క్రీడా వార్తలు: భారత మహిళ జట్టు ఏళ్ల నిరీక్షణకు ఆదివారం తెరపడింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి.. విశ్వ విజేతగా భారత్ నిలిచింది. ఈ అపూర్వ విజయంలో షెఫాలీ వర్మ (Shafali Verma) కీలక పాత్ర పోషించింది . అనూహ్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షఫాలి వర్మ.. తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. ఇక మ్యాచ్ అనంతరం వర్మ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. మ్యాచ్‌కు కొన్ని సెకన్ల ముందు దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్‌తో తాను మాట్లాడిన మాటలతో అంతా మారిపోయిందని చరిత్రాత్మక గెలుపు అనంతరం షెఫాలి వెల్లడించింది.
షఫాలీ వర్మ మాట్లాడుతూ.. 'నేను టెండూల్కర్ ను చూడగానే.. నాకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ మాస్టర్ బ్లాస్టర్ ను చూస్తేనే మనలో స్ఫూర్తి(Sachin Inspiration) కలుగుతుంది. ఈ గెలుపు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సాధించగలనని నాపై నాకు నమ్మకం ఉంది. నేను ఎలాంటి ఆందోళన చెందకుండా ఆటపై దృష్టిపెట్టా. జట్టులోని ప్రతి ఒక్కరూ నన్ను ప్రోత్సహించారు. ఏమీ ఆలోచించకుండా నా గేమ్ నన్ను ఆడమన్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్ సర్ (Sachin Tendulkar)ను చూడగానే నేను ఏదైనా సాధించగలనని నమ్మకం వచ్చేసింది’’ అని షెఫాలి చెప్పింది.
ఇక షెఫాలీ వర్మ గురించి చూస్తే.. ఈమె కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. పురుషుల క్రికెట్లో ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఎలా చెలరేగేవాడో ఉమెన్స్ టీమ్ లో షెఫాలీ వర్మ(Shafali Verma) అలాంటి పాత్రనే పోషిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రతీక రావల్ నిలకడగా రాణించడంతో కొంతకాలం షెఫాలీ మెరుపులు కనిపించలేదు. రావల్ గాయపడటంతో ఈ 21 ఏళ్ల హరియాణా అమ్మాయి అనూహ్యంగా జట్టులోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో అంతగా రాణించని ఆమె.. ఫైనల్లో మాత్రం బ్యాట్, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసింది.
ఇవి కూడా చదవండి:
Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!
Harmanpreet Kaur: ఆ ఓటమి మాలో మార్పు తెచ్చింది: హర్మన్