Share News

Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:05 PM

టీమిండియా తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి కొట్టగా.. కెప్టెన్ హర్మన్ ఆ క్యాచ్‌ను చక్కగా ఒడిసిపట్టింది. బంతిని క్యాచ్ పట్టిన అనంతరం హర్మన్ ప్రీత్ దాన్ని జేబులో భద్రంగా దాచిపెట్టుకున్న తీరు క్రికెట్ అభిమానులకు భారత దిగ్గజం సునీల్ గావస్కర్‌ను గుర్తు చేసింది.

Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!
Harmanpreet Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 246 పరగులకే ఔట్ అయింది. దీంతో టీమిండియా తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి కొట్టగా.. కెప్టెన్ హర్మన్(Harmanpreet Kaur) ఆ క్యాచ్‌ను చక్కగా ఒడిసిపట్టింది. బంతిని క్యాచ్ పట్టిన అనంతరం హర్మన్ ప్రీత్ దాన్ని జేబులో భద్రంగా దాచిపెట్టుకున్న తీరు క్రికెట్ అభిమానులకు భారత దిగ్గజం సునీల్ గావస్కర్‌(Sunil Gavaskar)ను గుర్తు చేసింది.


అది 1983..లార్డ్స్‌లో టీమిండియా తొలి ప్రపంచ కప్‌ను గెలిచిన రోజది. ఆ విజయం తర్వాత సునీల్ గావస్కర్ బంతిని ఇలాగే జేబులో భద్రపరుచుకుని సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇదే విధంగా మ్యాచ్ బాల్ వేళ హర్మన్ ప్రీత్ సంబరాలు చేసుకోవడం అందరినీ ఆకట్టకుంది. ఈ విషయంపై సన్నీ మీడియాతో మాట్లాడుతూ.. కెప్టెన్ కౌర్‌ను ప్రశంసించాడు. ‘ఆఖరి బంతిని పట్టినప్పుడు హర్మన్ ఏం చేసిందో చూశారా? 1983లో ఎవరో ఇలాగే బంతిని జేబులో పెట్టుకున్నట్లుగా మీరు గుర్తుందా? ఇది ఆమెకు జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ చరిత్రాత్మక క్యాచ్ పట్టిన తీరుకు ఆమె నుంచి కేవలం తన జట్టు వారే కాకుండా సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారు’ అని అన్నారు.


మాతృభాషలో హర్మన్ ఇంటర్వ్యూ..

ప్రపంచ కప్ గెలిచిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ తన మాతృభాష పంజాబీలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ విజయానికి ముందుగా నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ గెలుపు భారత జట్టు చేస్తున్న ఎన్నో ఏళ్ల పోరాటానికి ప్రతీక. అటువంటి కష్టతరమైన దశలే జట్టును మరింత బలంగా, ఐక్యంగా తీర్చిదిద్దుతాయి. భారత మహిళల క్రికెట్ జట్టులో ఇంత ప్రతిభావంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ప్రపంచ టోర్నీల్లో టీమిండియా ఎందుకు ఓడిపోతుందనే ప్రశ్న నన్ను అనేక సందర్భాల్లో ఇబ్బందికి గురి చేసేది’ అని కౌర్ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Harmanpreet Kaur: ఆ ఓటమి మాలో మార్పు తెచ్చింది: హర్మన్

BCCI Cash Reward: ఉమెన్ ఇన్ బ్లూకు డబ్బే.. డబ్బు. రూ. 51 కోట్ల క్యాష్ ప్రైజ్, ఇంకా ఎన్నో..

Updated Date - Nov 03 , 2025 | 02:05 PM